కరీంనగర్ వీధుల నుండి మంత్రి వరకు..!.. బండి సంజయ్ ఆసక్తికర ట్వీట్

by Ramesh Goud |
కరీంనగర్ వీధుల నుండి మంత్రి వరకు..!.. బండి సంజయ్ ఆసక్తికర ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కరీంనగర్ వీధుల నుంచి మంత్రిగా నియామకం కోసం సిఫార్స్ వరకు అంటూ కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి ట్వీట్ చేశారు. ఇవ్వాళ దేశ ప్రధానిగా మూడో సారి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు మరికొందరు మంత్రులు, సహాయ మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండటంతో.. మంత్రులుగా నియామకం కోసం బీజేపీతో పాటు ఎన్డీఏ పక్షాల నాయకులను సిఫార్సు చేయడం జరిగింది. ఇందులో తెలంగాణ నుంచి బీజేపీ ఎంపీలుగా ఎన్నికైన వారిలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డితో పాటు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ లకు అవకాశం దక్కింది. దీంతో బండి సంజయ్ తన పేరుపై ఉన్న నియామక పత్రాన్ని తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

దీనిపై కరీంనగర్ వీధుల నుండి మంత్రి మండలిలో రాష్ట్ర మంత్రిగా నియామకం కోసం సిఫార్సు చేయడం వరకు అంటూ.. నేను దీనిని వ్రాసేటప్పుడు, కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గ ప్రజలకు ఎంత కృతజ్ఞతతో ఉన్నానో చెప్పలేను అని అన్నారు. అలాగే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గారికి, తెలంగాణ బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ముఖ్యంగా నరేంద్రమోదీ గారికి నన్ను ప్రోత్సహించి ఈ ఎదుగుదలకు సహకరించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. దీనిపై అభిమానులు స్పందిస్తూ.. మీ కష్టానికి ఫలితం దక్కిందని, అభినందనలు తెలియజేస్తున్నారు. ఇక కేంద్రమంత్రి బండి సంజయ్ నియామకం అవ్వడంతో అభిమానుల సంబరాలు అంభరాన్ని అంటాయి. కరీంనగర్ లోనే గాక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంజయ్ అభిమానులు బాణ సంచా కాల్చి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed