- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఇకపై రాష్ట్రపతి నిలయం సందర్శనకు అందరికీ అనుమతి.. ఎప్పటి నుంచి అంటే..
దిశ ప్రతినిది, మేడ్చల్: ఇన్నాళ్లుగా నగరంలో ఉన్న రాష్ట్రపతి నిలయం సందర్శన పూర్తి స్థాయిలో అన్నివేళలా అందుబాటులో ఉండేది కాదు. సాధారణ ప్రజలు రాష్ట్రపతి భవనాన్ని పూర్తిగా సందర్శించాలి అంటే సాధ్యం కానీ పనిగా చెప్పవచ్చు. కానీ ఇకపై సాధారణ ప్రజలు రాష్ట్రపతి భవనాన్ని సందర్శించాలనే కోరిక నెరవేర్చే విధంగా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకు సాధారణ ప్రజలను లోనికి అనుమతించేందుకు ఈ నెల 22వ తేదీన అధికారికంగా ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రపతి ద్రౌపది ముర్మ్ము ప్రారంభించనున్నారు అని బొల్లారం రాష్ట్రపతి భవన్ అధికారులు వెల్లడించారు.
ఉగాదిని పురస్కరించుకొని..
తెలుగువారి నూతన సంవత్సర పర్వదినం ఉగాదిని పురస్కరించుకొని అధికారికంగా ప్రారంభించి సాధారణ ప్రజలను రాష్ట్రపతి నిలయంలోకి అనుమతించనున్నారు. గతంలో సంవత్సరంలో 15 రోజులు మాత్రమే రాష్ట్రపతి నిలయం సందర్శన ఉండేది. అది కూడా కేవలం గార్డెన్ వరకే పరిమితమై ఉండేది. కానీ ఇప్పుడు సంవత్సరం పొడువునా రాష్ట్రపతి నిలయంలో ఉన్న గార్డెన్ తో పాటుగా హెరిటేజ్ బిల్డింగ్ లోపలికి కూడా అనుమతించనున్నారు. భవనంలో ఉన్న ఏర్పాట్లు, వివిధ సందర్భాలలో దేశ విదేశాల నుంచి బహుమతులుగా వచ్చిన పలు రకాల వస్తువులతో పాటు అన్ని ప్రాంతాల్లో సందర్శన అనుమతి ఉంటుందని తెలిపారు. అంతేకాకుండా గ్యాలరీలో సెల్ఫీలు దిగొచ్చాని పేర్కొన్నారు.
ఈ నెల 14వ తేదీ నుంచి టికెట్స్ బుక్ చేసుకోవచ్చు..
అధికారికంగా మార్చి 22వ తేదీ నుంచి బొల్లారం రాష్ట్రపతి నిలయం లోపలికి సందర్శకులను అనుమతించనున్నారు. ఇందుకు ముందుగా ఆన్ లైన్ లో రూ. 50 చెల్లించి రిజిస్టర్ చేసుకోవాలి. 22వ తేదీ నుంచి లోనికి అనుమతి ఉన్నప్పటికీ ఈ నెల 14వ తేదీ నుంచి రాష్ట్రపతి భవన్ అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి అనుమతి కోసం రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా అధికారులు సూచించారు. భారతీయులకు టికెట్ ధర రూ. 50 కాగా, విదేశీయులకు టికెట్ ధర ఒక్కొక్కరికి రూ. 250గా నిర్ణయించారు. సందర్శకుల సౌకర్యార్థం ఉచిత పార్కింగ్, డ్రింకింగ్ వాటర్, క్లాక్ రూం ఫెసిలిటీ, ప్రథమ చికిత్సలతో పాటుగా కెఫేను అందుబాటులో ఉంటాయని రాష్ట్రపతి నిలయం అధికారులు వెల్లడించారు.