రాత పరీక్ష లేకుండా ఎంపిక.. ఫ్రీ ట్రైనింగ్‌తో పాటు ఉద్యోగం

by Seetharam |
రాత పరీక్ష లేకుండా ఎంపిక.. ఫ్రీ ట్రైనింగ్‌తో పాటు ఉద్యోగం
X

దిశ, వెబ్‌డెస్క్: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ.. తెలంగాణ ప్రభుత్వానికి చెందిన స్వామీ రామానంద తీర్ద గ్రామీణ సంస్థ నిరుద్యోగ యువతకు ఉచిత ఉపాధి శిక్షణ ఉద్యోగ కల్పన కార్యక్రమానికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

శిక్షణా కార్యక్రమం:

బేసిక్ కంప్యూటర్స్, సి లాంగ్వేజ్ (అర్హత: డిగ్రీ పాస్ అయి ఉండాలి)

గ్రాఫిక్ డిజైనింగ్/డీటీపీ (ఇంటర్ ఉత్తీర్ణత)

అకౌంట్స్ అసిస్టెంట్ యూజింగ్ ట్యాలీ (బీకామ్/ఇంటర్ - సీఈసీ /ఎంఈసీ)

ఆటోమొబైల్స్ 2 నుంచి 3 వీలర్ సర్వీసింగ్ (పదవ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి)

శిక్షణాకాలం: 2 నెలలు ఉంటుంది.

కావలసిన పత్రాలు:

అర్హతల ఒరిజినల్ సర్టిఫికెట్స్, జిరాక్స్ సెట్

పాస్ పోర్ట్ ఫోటోలు

ఆదార్ కార్డ్

హాస్టల్ ఫీజు: నెలకు రూ. 3000 హాస్టల్ ఫీజు చెల్లించాలి.

అడ్రస్: స్వామీ రామానంద తీర్ధ గ్రామీణ సంస్థ, జలాల్ పూర్ (గ్రా), పోచంపల్లి (మండలం), యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణా - 508284.

సంస్థలో హాజరు కావలసిన తేదీ: జులై 3, 2023 సోమవారం ఉదయం 10 గంటలకు హాజరుకావాలి.

వివరాలకు ఫోన్: 9133908000, 9133908111, 9133908222, 9948466111.

Advertisement

Next Story

Most Viewed