- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఓవైసీని సంతోష పెట్టేందుకు రజక వృత్తిని నాశనం చేస్తారా??
దిశ, తెలంగాణ బ్యూరో : ముస్లిం దోబీ ఘాట్లకు, లాండ్రీ షాపులకు 250 యూనిట్ల ఉచిత పథకాన్ని వర్తింప చేయాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ బుధవారం ఒక ప్రకటనలో ఖండించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయంతో తరతరాలుగా ధోబీ వృత్తిపై ఆధారపడి బతుకుతున్న రజకులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడతారని బండి ఆవేదన వ్యక్తంచేశారు. ఇక గల్లీ గల్లీలో వేరే వర్గానికి చెందిన వారి లాండ్రీ షాపులు వెలుస్తాయని ఆయన పేర్కొన్నారు. ఓవైసీని సంతోష పెట్టడానికి రజకుల వృత్తిని నాశనం చేస్తారా? అని బండి ప్రశ్నించారు. నయా నిజాం కేసీఆర్ కు మత పిచ్చి ఎక్కువైందని బండి ఘాటు విమర్శలు చేశారు. ఒక మతం ఓట్ల కోసం కేసీఆర్ హిందూ సమాజం లో ఉన్న కులవృత్తులను అణిచివేస్తున్నారని ఫైరయ్యారు. కేసీఆర్ ది మత దురహంకారమని ధ్వజమెత్తారు.
బీసీల కుల వృత్తులను ఆర్థికంగా దెబ్బతీసయినా సరే ఎంఐఎంను సంతృప్తి పరచాలన్నదే కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారని పేర్కొన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ మైనార్టీ వర్గం ఓట్ల కోసం కేసీఆర్ బీసీల కులవృత్తులపై దాడి చేస్తారా అని బండి ప్రశ్నించారు. ఇప్పటికే వేరే వాళ్ళు దూరడంతో తమ కులవృత్తుల వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని బీసీ కులాల వారు తీవ్ర మనో వేదనలో ఉన్నారని, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో మూలిగే నక్కపై తాటి పండు ఎత్తేసినట్టుగా ఉందన్నారు. కులవృత్తులపై ఆధారపడిన బీసీలు, ఎస్సీలు కేసీఆర్ చేస్తున్న ద్రోహన్ని గమనిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఉన్న రజకులకు బీజేపీ అండగా ఉంటుందని, సమిష్టిగా కేసీఆర్ మత దురహంకారంపై పోరాడి కులవృత్తులను కాపాడుకుందామని బండి పిలుపునిచ్చారు.