సివిల్ సర్వీస్ పరీక్షలపై ఉచిత అవగాహన..

by Vinod kumar |
సివిల్ సర్వీస్ పరీక్షలపై ఉచిత అవగాహన..
X

దిశ, తెలంగాణ బ్యూరో: అమిగోస్ ఐఏఎస్ అకాడమీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన అభ్యర్థులకు సివిల్ సర్వీస్ పరీక్షలపై ఉచితంగా అవగాహన కల్పిస్తున్నట్లు అకాడమీ డైరెక్టర్ మంజునాథ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సదస్సును ఆదివారం ఉదయం అశోక్ నగర్‌లోని అమిగోస్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సివిల్ సర్వీసెస్ సిలబస్, ప్రిపరేషన్ స్ట్రాటజీ వంటి అంశాలపై అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈనెల 14వ తేదీ నుంచి సివిల్స్ ప్రిలిమ్స్, మెయిన్స్ నూతన బ్యాచ్‌ను ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఉచిత అవగాహన సదస్సుకు హాజరుకావాలని కోరారు. పూర్తి వివరాలకు 040 35052121 లేదా 9000230735, 9133237733 నంబర్లకు సంప్రదించాలని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed