సీఎం రేవంత్ రెడ్డిని ఆ నలుగురు వెన్నుపోటు పొడవాలని చూస్తున్నారు: కేఎ పాల్

by Mahesh |   ( Updated:2024-06-02 16:31:13.0  )
సీఎం రేవంత్ రెడ్డిని ఆ నలుగురు వెన్నుపోటు పొడవాలని చూస్తున్నారు: కేఎ పాల్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రజాశాంతి పార్టీ జాతీయ అధ్యక్షుడు కేఏ పాల్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సారి ఓ నలుగురు నాయకు సీఎం రేవంత్ రెడ్డిని వెన్నుపోటు పొడవాలని చూస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేస్తూ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఇటీవల రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత మొదటి సారి కలిసిన కేఎ పాల్.. అక్టోబర్ 2న తెలంగాణలో నిర్వహించే గ్లోబల్ పీస్ అండ్ ఎకనామిక్ సమ్మిట్ ను నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని కోరిన విషయం తెలిసిందే. దీని తర్వాత ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మాజీ సీఎం ఎన్టీఆర్ తరహాలో నలుగురు కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి ని వెన్నుపోటు పొడిచి సీఎం అవ్వాలని చూస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. అలాగే అలా చేయాలని చూస్తున్న వారికి గుండు కొట్టిస్తానని కేఏ పాల్ వార్నింగ్ కూడా ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed