- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రేపటి నుంచి 'ఫార్ములా ఈ-రేసింగ్'.. పకడ్బందీగా ఏర్పాట్లు చేసిన తెలంగాణ సర్కార్!
దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ సాగరతీరాన రేపటి నుంచి ఫార్ములా ఈ రేసింగ్ ప్రారంభం కానుంది. దేశంలోనే మొట్టమొదటి సారిగా జరిగే ఈ కార్ రేసింగ్ ట్రాక్‌ను ప్రత్యేకంగా, పకడ్బందీగా తీర్చిదిద్దారు. శుక్రవారం సాయంత్రం ఫార్ములా ఈ ప్రాక్టీస్ రేస్ ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 2.25 నుంచి 5.15 వరకు ప్రాక్టీస్ ఉంటుంది. తిరిగి ఎల్లుండి ఉదయం 8:05 గంటల నుంచి 8:55 వరకు ఫార్ములా ఈ ప్రాక్టీస్ రేస్-2 జరగనుంది. అనంతరం ఉదయం 10.40 నుంచి 11.55 వరకు క్వాలిఫైయింగ్ రేస్ జరగుతాయి. రౌండ్ 4 పోటీలు ఎల్లుండి మధ్యాహ్నం 3 గంటల నుంచి 4.30 వరకు సాగనుంది. ఇప్పటికే మొదటి రౌండ్ మెక్సికో,
రెండో, మూడో రౌండ్ దిరియా, నాలుగో రౌండ్ హైదరాబాద్, ఐదో రౌండ్ కేప్ టౌన్ జట్లు గెలిచాయి. ఈ రేసులో మొత్తం 16 రౌండ్లు ఉండగా.. ఆఖరి రౌండ్ లండన్‌లో జరగనుంది. నాలుగో రౌండ్ హైదరాబాద్‌లో జరుగుతండగా.. ఐదో రౌండ్ సౌత్ ఆఫ్రికాలోని కేప్ టౌన్ తర్వాత బ్రెజిల్, బెర్లిన్, మోనాకో, జాకర్త, పోర్ట్ ల్యాండ్, లండన్ ఫార్ములా ఈ రేసింగ్‌కు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. కాగా, హుస్సేన్ సాగర్ తీరంలో ఇప్పటికే అన్నిఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసింది. మొత్తం 22,500 మంది ప్రేక్షకులు వీక్షించేలా గ్యాలరీలను ఏర్పాటు చేసింది. 1000 రూపాయల మొదలు లక్షా 25 వేల రూపాయల ధర కలిగిన టికెట్ల అమ్మకాలు చేపట్టింది. ప్రస్తుతం వెయ్యి, 4వేలు, 10,500 ధర ఉన్న టికెట్లు సోల్డ్ అవుట్‌గా చూపిస్తున్నాయి.
Also Read...
ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. పరీక్షల వేళ బోర్డు కీలక నిర్ణయం