Formula E-Race Case: నేడు ఈడీ విచారణకు బీఎల్‌ఎన్ రెడ్డి

by Shiva |   ( Updated:2025-01-08 03:01:21.0  )
Formula E-Race Case: నేడు ఈడీ విచారణకు బీఎల్‌ఎన్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: ఫార్ములా-ఈ కారు రేసు (Formula E-Car Race) వ్యవహారంలో మనీ లాండరింగ్ (Money Laundering), ఫెమా నిబంధనలను (FEMA Regulations) ఉల్లంఘించారనే అభియోగాల నేపథ్యంలో హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్‌ఎన్ రెడ్డి (BLN Reddy)కి ఈడీ (Enforcement Directorate) ఇటీవలే నోటీసులు జారీ చేసింది. అదేవిధంగా ఇదే కేసులో అంతముందే ఆయనపై ఏసీబీ (ACB) కేసు నమోదు చేసి, A3 నిందితుడిగా గుర్తించింది. ఈ క్రమంలోనే ఇవాళ ఆయన ఉదయం 10 గంటలకు ఈడీ (ED) విచారణకు హాజరుకానున్నారు.

ఫార్ములా ఈ-రేసు (Formula E-Race) కేసుకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పటికే ఈడీ (ED), ఏసీబీ (ACB) నుంచి సేకరించింది. ఆ వివరాల ఆధారంగానే ఇవాళ బీఎల్ఎన్ రెడ్డి స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేయనున్నారు. ఫార్ములా ఈ-రేసు 2 అగ్రిమెంట్ సమయంలో డబ్బు బదిలీలో బీఎల్‌ఎన్ రెడ్డి (BLN Reddy) కీలకంగా వ్యవహరించినట్లుగా ఈడీ అధికారులు గుర్తించారు. మరోవైపు ఇదే కేసుకు సంబంధించి సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్‌ (Aravind Kumar) ఇవాళ ఏసీబీ విచారణకు హాజరు కానున్నారు. మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిశోర్ ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా ఆయనను ఏసీబీ (ACB) అధికారులు విచారించనున్నారు.

Advertisement

Next Story

Most Viewed