- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
T Hub: టీ హబ్ కొత్త సీఈవోగా OYO మాజీ చీఫ్ గ్రోత్ ఆఫీసర్ కవికృత్

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. (T-Hub) టీ హబ్ కొత్త సీఈవోగా కవికృత్‌ను నియమించింది. ఈ మేరకు శుక్రవారం ఐటీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, ప్రఖ్యాత బిజినెస్ స్కూల్ నుంచి ఆయన ఎంబీఏ, బిట్స్ పిలాని నుంచి ఫైనాన్స్‌లో ఎంఎస్ చేశారు. అదేవిధంగా ఓయోలో మాజీ చీఫ్ గ్రోత్ ఆఫీసర్‌గా (Kavikrut) కవికృత్ పనిచేశారు.
టీహబ్ సీఈవోగా శ్రీనివాస్‌రావు పదవీకాలం గత అక్టోబర్ నెలలో ముగిసింది. దీంతో కొత్త సీఈవోను ఏర్పాటు చేసే వరకు టీ హబ్ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ సుజిత్‌ను ఇన్ చార్జిగా నియమించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కొత్త సీఈవోగా కవికృత్ నియమితులయ్యారు. మార్చి 10వ తేదీ నుంచి ఈ నియామకం అమలులోకి రానుంది. కాగా, తెలంగాణలో స్టార్టప్‌లు, ఆవిష్కరణలు ప్రోత్సహించడానికి గత రాష్ట్ర ప్రభుత్వం టీ హబ్ ఏర్పాటు చేసిన విషయం విదితమే. ఈ టీ హబ్ ప్రపంచంలోనే ప్రముఖ స్టార్టప్ ఇంక్యుబేటర్‌లలో ఒకటిగా గుర్తింపు పొందింది.