- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీజేపీలోకి బూర నర్సయ్య గౌడ్.. చేరికకు ముహూర్తం ఖరారు!
దిశ, తెలంగాణ బ్యూరో: మునుగోడు ఉప ఎన్నికల సమయంలో మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ టీఆర్ఎస్‌కు షాకిచ్చారు. పార్టీకి రాజీనామా చేశారు. తాను ఏ పార్టీలో చేరబోతానన్న విషయాన్ని త్వరలోనే ప్రకటిస్తామని సస్పెన్స్‌లో పెట్టిన ఆయన త్వరలోనే బీజేపీలోకి చేరనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తేదీని కూడా ఫిక్స్ చేసుకున్నారు. ఈనెల 19వ తేదీన ఢిల్లీలో బీజేపీ అగ్రనేతల సమక్షంలో చేరుతారని విశ్వసనీయ సమాచారం. తొలుత అక్కడ కాషాయ కండువా కప్పుకున్న అనంతరం తిరిగి మునుగోడు నియోజకవర్గంలో నిర్వహించే ప్రచార సభలోనూ ఆయన తన అనుచరులతో పార్టీ కండువా కప్పుకోనున్నారు. బూర నర్సయ్య గౌడ్ పార్టీ మారడం టీఆర్ఎస్‌కు పెద్ద మైనస్‌గా మారనుంది. మునుగోడు నియోజకవర్గంలో ఉన్న రెండున్నర లక్షల ఓట్లలో దాదాపు లక్షకు పైగా బహుజనుల ఓట్లున్నాయి. అందులో గౌడ్ సామాజికి వర్గానికి చెందిన వారివి దాదాపు 40 వేలున్నాయి.
ఇది గులాబీ పార్టీకి తీవ్ర నష్టాన్ని కలిగించనుంది. బూర నర్సయ్య గౌడ్ ఉద్యమకాలం నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వెన్నంటి ఉన్న వ్యక్తుల్లో ఒకరిగా ఉంటూ వచ్చారు. మునుగోడు టికెట్ ఆశించి భంగపడ్డారు. ఇక ఆయన కేసీఆర్‌కు రాసిన లేఖలో బానిస బతుకులు బతలేమని గట్టి కౌంటర్ ఇచ్చారు. దీన్ని బట్టి చూస్తుంటే నర్సయ్య గౌడ్ మునుగోడు ఓటర్లను ప్రభావితం చేసే అవకాశాలున్నాయి. ఇది గులాబీ పార్టీకి భారీగా మైనస్ కానుంది. ఇదిలా ఉండగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆదివారం రాత్రి తన ఢిల్లీ పర్యటనను ముగించుకుని హైదరాబాద్‌కు చేరుకున్నారు. కాగా సోమవారం హైదరాబాద్‌లోని బూర నర్సయ్య గౌడ్ ఇంటికి పార్టీ నేతలతో కలిసి వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి : స్థానిక లీడర్స్ జంపింగ్‌లతో మునుగోడులో ఏ పార్టీకి నష్టం చేకూరుస్తారో..?