బీఆర్ఎస్ ను అంతం చేయడం కోమటిరెడ్డి వల్లకాదు : మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత

by M.Rajitha |
బీఆర్ఎస్ ను అంతం చేయడం కోమటిరెడ్డి వల్లకాదు : మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత
X

దిశ, తెలంగాణ బ్యూరో : బీఆర్ఎస్ ను అంతం చేయడం మంత్రి కోమటి రెడ్డి కాదు కదా ఆయన జేజమ్మ తరం కూడా కాదని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. గంధమల్ల రిజర్వాయర్ పనులు పూర్తి చేయకుండా కోమటి రెడ్డి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణ భవన్ లో సోమవారం నాగోల్ మధర్ డెయిరీచైర్మన్ లింగాల శ్రీకర్ రెడ్డి, డైరెక్టర్ చింతలపూడి వెంకట్ రాంరెడ్డి తో కలిసి మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ కుటుంబంపై, పార్టీపై పడి ఏడవకుండా కోమటి రెడ్డి ఆయన కుటుంబంలో విభేధాల సంగతి చూసుకోవాలని సూచించారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ,కవితలపై మాట్లాడే అర్హత కోమటి రెడ్డికి లేదన్నారు. కాంగ్రెస్, బీజేపీలు కుమ్మకై కవితను జైల్లో పెట్టారని మండిపడ్డారు. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి తన సోదరుడు రాజగోపాల్ రెడ్డికి, కాంగ్రెస్ లో ఉంటూ ఓటు వేయాలని చెప్పిన చరిత్ర వెంకట్ రెడ్డిది అన్నారు. ఎంపీగా ఉమ్మడి నల్లగొండ జిల్లాకు మంత్రిగా కోమటి రెడ్డి చేసింది శూన్యం అన్నారు. తపాస్ పల్లికి నీళ్లు తెస్తా అని కోమటి రెడ్డి హామీ ఇచ్చారు.. ఆ హామీ ఏమైందని నిలదీశారు. రిజర్వాయర్ల నుంచి జిల్లా చెరువులు నింపే అవకాశమున్నా ఆ పని కోమటి రెడ్డి చేయడం లేదని ప్రశ్నించారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజిని పోచం పల్లి నుంచి రంగారెడ్డి జిల్లాకు రేవంత్ రెడ్డి తరలిస్తే మంత్రిగా ఏం చేస్తున్నారు? అని ప్రశ్నించారు. గంధమల్ల రిజర్వాయర్ ను నింపితే తిరుమలగిరి వరకు సాగునీరు అందుతుందని వెల్లడించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రూ.18 కోట్లు పాడి రైతులకు చెల్లించాల్సిన బకాయిలు ఉన్నాయని, వాటిని ముందు ఇప్పించాలని డిమాండ్ చేశారు. చేనేత కార్మికులకు రావాల్సిన బకాయిలపై కోమటి రెడ్డి ఎందుకు మౌనంగా ఉంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. యాదాద్రికి మంజూరైన మెడికల్ కాలేజీ ని గతం లో కేటాయించిన ప్రదేశంలోనే ఉంచేలా కోమటి రెడ్డి ఎందుకు ప్రయత్నించడం లేదో చెప్పాలన్నారు. రైతురుణమాఫీపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని, యాదాద్రి భువనగిరి జిల్లా రుణమాఫీపైనా వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. సాగునీళ్లపై మంత్రి కోమటి రెడ్డికి శ్రద్ద లేదు, మిషన్ భగీరథపై అబద్దాలు మాట్లాడారన్నారు. యాదాద్రిలో డంపింగ్ యార్డు కేసీఆర్ ప్రభుత్వంలో నిర్మాణం జరిగిందని, 9 నెలలైనా ఎందుకు ప్రారంభించడం లేదని ప్రశ్నించారు. అమృత్ స్కీం ద్వారా యాదాద్రి మున్సిపాలిటీకి కేటాయించిన నిధులు ఎందుకు ఖర్చు చేయడం లేదన్నారు. అమృత్ పథకంపై కేటీఆర్ మాట్లాడిన దాంట్లో తప్పేమి లేదన్నారు.

Next Story

Most Viewed