తప్పకుండా చర్యలు ఉంటాయ్.. మాజీ మంత్రి కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |   ( Updated:2024-09-16 11:32:19.0  )
తప్పకుండా చర్యలు ఉంటాయ్.. మాజీ మంత్రి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కేసీఆర్(KCR) ఆనవాళ్లు లేకుండా చేయాలని కాంగ్రెస్ నేతలు కుట్రలు చేస్తున్నారని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి(Vemula Prashanth Reddy) ఆరోపించారు. సోమవారం తెలంగాణ భవన్‌(Telangana Bhavan)లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు, రాజీవ్ గాంధీ(Rajiv Gandhi)కి ఏం సంబంధం లేదని అన్నారు. అలాంటి వ్యక్తి విగ్రహం సచివాలయం(Secretariat) ఎదుట ఎలా పెడతారని ప్రశ్నించారు. సోనియాగాంధీ(Sonia Gandhi) మెప్పు కోసమే రాజీవ్ గాంధీ విగ్రహం పెడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి‌పై విమర్శలు చేశారు. ఢిల్లీ బాసులను ప్రసన్నం చేసుకోవడానికి రేవంత్ రెడ్డి(Revanth Reddy) తెలంగాణ ఆత్మను తాకట్టు పెట్టారని కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ఎక్కడైతే రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టారో.. అక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలని కేసీఆర్ ప్లాన్ చేశారు. తెలంగాణ తల్లి విగ్రహంతో పాటుగా ఒక ప్లాజాను ఏర్పాటు చేయాలని భావించారు.

పోలీస్ స్టేషన్, ఫుడ్ కోర్ట్స్, బస్ స్టాప్ కట్టాలని కేసీఆర్ అనుకున్నారు. డిజైన్స్ కూడా పూర్తయింది. ఒక వైపు సచివాలయం, మరోవైపు తెలంగాణ అమరజ్యోతి మధ్యలో తెలంగాణ తల్లిని పెట్టాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. కానీ తెలంగాణ ఆత్మ లింక్‌ను కట్ చేసి రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టారు. తెలంగాణతో కేసీఆర్‌కు ఉన్న పేగుబంధం రేవంత్ రెడ్డికి లేదు. ఎలాంటి సందర్భం లేకుండా రాజీవ్ గాంధీ విగ్రహం ప్రారంభిస్తున్నారు. హామీలు అమలు చేయలేకపోతున్నారు. కాబట్టి ప్రజల్లో ఉన్న అసంతృప్తిని డైవర్ట్ చేసే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి ఉన్నారు.

కేసీఆర్ చేసిన మంచిని కొనసాగించొద్దని రేవంత్ రెడ్డి ఫిక్స్ అయ్యారు. అందుకే కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు. మేము అధికారంలోకి వచ్చాక తెలంగాణ తల్లి గౌరవం పెరిగే విధంగా తప్పకుండా చర్యలు ఉంటాయి. తెలంగాణ అమరవీరుల త్యాగాలను కొనసాగించాలని అమరజ్యోతిని కేసీఆర్ నిర్మించారు. అమెరికాలో ఉన్న చికాగో బీన్ కంటే పెద్దదిగా తెలంగాణ అమరజ్యోతి నిర్మాణం జరిగింది. తెలంగాణ అమరజ్యోతిని ప్రజలకు అందుబాటులోకి తేవడం లేదు. కేసీఆర్ ఆనవాళ్లను చేరిపివేయాలని రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది జరగని పని’’ వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.

Advertisement

Next Story

Most Viewed