- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
CM అపాయింట్మెంట్ కన్ఫామ్ అయింది.. ఒక్కొక్కరి సంగతి రేపు చెప్తా: మల్లారెడ్డి
దిశ, వెబ్‌డెస్క్: మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కుత్బుల్లాపూర్ పరిధి సుచిత్రలోని ఓ భూమి వివాదం విషయంలో మాజీ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కు మధ్య మాటల యుద్ధం జరుగుతోన్న విషయం తెలిసిందే. ఆ భూమి నాదంటే నాదంటూ ఒకరికొకరు ఎవరూ తగ్గడం లేదు. ఈ క్రమంలో ఎమ్మెల్యే లక్ష్మణ్‌కు మల్లారెడ్డి సవాల్ విసిరారు. సుచిత్రలోని తన భూమి పత్రాలు ఫేక్ అని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు తాను సిద్ధమంటూ మల్లారెడ్డి ఛాలెంజ్ చేశారు. మరి ఆ భూ పత్రాలు సరైనవి అయితే.. రాజీనామా చేసేందుకు సిద్ధమా అని లక్ష్మణ్‌కు సవాల్ విసిరారు.
ఈ క్రమంలోనే వీరు పార్లమెంట్ ఎన్నికలు ముగిసి ఫలితాల కోసం ఎదురుచూస్తోన్న సమయంలో రాజకీయ వేడిని పెంచుతున్నారు. తాజాగా.. ఇవాళ భూ వివాదంపై స్పందిస్తూ మల్లారెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ తతను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పుడు పత్రాలతో, ఫోర్జరీ చేసిన డాక్యుమెంట్లను చూపుతూ తన భూమిని కబ్జా చేసేందుకు ట్రై చేస్తున్నారని అన్నారు. తన దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్లు ఉన్నాయని తెలిపారు. రేపు సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కన్ఫామ్ అయిందని, ఈ వ్యవహారం అంతా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తానని మల్లారెడ్డి చెప్పారు.