KTR: ఎట్లుండె.. ఎట్లాయె తెలంగాణ! ఏడాది పాలనపై కేటీఆర్ ఆసక్తికర పోస్ట్

by Ramesh N |
KTR: ఎట్లుండె.. ఎట్లాయె తెలంగాణ! ఏడాది పాలనపై కేటీఆర్ ఆసక్తికర పోస్ట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎట్లుండె తెలంగాణ.. ఎట్లాయె తెలంగాణ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా గురువారం ఆసక్తికర పోస్ట్ చేశారు. పాలమూరులో పల్లికి మద్దతు ధర కోసం, వైరాలో మిర్చికి మద్దతు ధర కోసం, బయ్యారంలో కరెంటు కోసం, జగిత్యాలలో యూరియా కోసం.. భూమిని నమ్ముకుని ప్రపంచానికి బువ్వను అందించే రైతన్నలు నేడు పిడికిలెత్తి నిరసనలు చేస్తున్నారని తెలిపారు.

పదేళ్ల కేసీఆర్ (KCR) పాలనలో గుండెల నిండా ఆత్మవిశ్వాసంతో వ్యవసాయం చేసిన రైతన్నలు.. నేడు ఏడాది (Congress one-year rule) కాంగ్రెస్ పాలనలో గుండె దిగులుతో కాలం వెల్లదీస్తున్నరని ఆవేదన వ్యక్తం చేశారు. దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో దగాపడ్డ రైతన్నలు.. పదేళ్ల కేసీఆర్ పాలనలో నింపుకున్న వెలుగులు ఏడాది కాంగ్రెస్ పాలనలో మటుమాయం అవుతున్నాయని విమర్శించారు. రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ, కరెంటు, యూరియా, సాగునీరు, పంట కొనుగోలు కోసం ఎదురు చూపులు చూస్తున్నారని తెలిపారు. ఏడాది కాంగ్రెస్ పాలన ఎదురుచూపుల పాలన అయిందన్నారు. జాగో రైతన్న జాగో.. జాగో తెలంగాణ జాగో అంటూ ట్వీట్ చేశారు.

Next Story