- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
KTR : సర్వేలు సరే.. పాలనేది? కాంగ్రెస్ అధిష్టానానికి కేటీఆర్ ప్రశ్నల వర్షం!
దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ అధిష్టానానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రశ్నల వర్షం గుప్పించారు. ఈ మేరకు ఆయన సోమవారం ఎక్స్ వేదికగా వెల్లడించారు. ప్రజాపాలనా ? ప్రతీకార పాలనా ? అంటూ విమర్శించారు. సర్వేలు సరే, పథకాలేవీ-పాలనేది? ఉన్నవి ఉంచుతారా, ఊడబీకుతారా ప్రజల ప్రశ్నలకు సమాధానమేది? అని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా ఆరు గ్యారంటీలను ఎందుకు అమలు చేయడం లేదు ? కాంగ్రెస్ అధిష్టానం (Congress leadership) ఎందుకు పట్టించుకోవట్లేదు ? అని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు కొనే నాధుడు లేక రైతన్నలు కన్నీళ్లు పెడుతున్నా కాంగ్రెస్ అధిష్టానం గుండె కరగదా? అని నిలదీశారు. హైడ్రా, మూసీ ప్రక్షాళన పేరుతో పేదల ఇండ్లు కూలుస్తున్నా, వాళ్లు గుండెలవిసేలా రోదిస్తున్నా కాంగ్రెస్ అధిష్టానానికి చలనం రాదా? అని విమర్శించారు. ఎకరాకు ఏడాదికి రూ.15 వేలు , రైతు భరోసా అందక రైతన్నలు పెట్టుబడుల కోసం తిప్పలు పడుతున్నా కాంగ్రెస్ (Congress) అధిష్టానం ఎందుకు స్పందించడం లేదన్నారు.
అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.2 లక్షల రుణమాఫీ అని అరకొర రుణమాఫీతో రైతులను అరిగోస పెడుతున్నా కాంగ్రెస్ అధిష్టానం ఎందుకు పట్టించుకోదన్నారు. సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ప్రతిరోజూ ఫుడ్ పాయిజన్ జరిగి విద్యార్థులు ఆసుపత్రుల పాలవుతున్నా ఎందుకు కనీసం సమీక్షించరని ఆరోపించారు. ఎన్నికలకు ముందు నిరుద్యోగులను వాడుకుని ఇప్పుడు (Groups Exams) గ్రూప్ 1,2,3,4 పరీక్షలపై వారు అడుగుతున్న డిమాండ్లను ఎందుకు నెరవేర్చరని పేర్కొన్నారు. ఆడబిడ్డలకు మహాలక్ష్మి పథకం కింద నెలకు రూ.2500 ఏమయిందన్నారు. అవ్వ, తాతలకు నెలకు రూ.4,000 పింఛన్ ఎప్పటి నుంచి ఇస్తారన్నారు. రాష్ట్రంలో నడుస్తున్నది ఏసీబీ, జేసీబీ సర్కార్.. కూల్చడం తప్ప నిలబెట్టడం తెలియని కాంగ్రెస్ సర్కార్ అంటూ విమర్శించారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కాంగ్రెస్ అధిష్టానం ఎందుకు నోరు మెదపదని, రాష్ట్రం నుంచి మూటలు వస్తున్నందుకే రాహుల్ మాటలు మూగబోయాయా? అని ప్రశ్నించారు.