మళ్లీ తెరపైకి ‘‘రాయల తెలంగాణ’’.. మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి సంచలన డిమాండ్

by Satheesh |   ( Updated:2023-04-24 10:33:08.0  )
మళ్లీ తెరపైకి ‘‘రాయల తెలంగాణ’’.. మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి సంచలన డిమాండ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాయల తెలంగాణ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. తాజాగా మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రాయలసీమను తెలంగాణలో కలపాలని ఆయన డిమాండ్ చేశారు. అప్పుడే రాయలసీమ నీటి సమస్య తీరుతుందన్నారు. రాష్ట్రాలు విడగొట్టడం సులువు కానీ కలపడం చాల కష్టం అన్నారు. రాయలసీమను కలుపుకోవాల్సిన అవసరం కేసీఆర్‌కు ఉందన్నారు. రాయల తెలంగాణ కావడానికి ఎవరికీ అభ్యంతరం లేదని, నాయకులందరినీ సమీకరిస్తున్నానన్నారు. ఎన్నికల తర్వాత నేతలందరినీ కలుస్తానని చెప్పారు. కాగా రాష్ట్ర విభజనకు ముందు రాయల తెలంగాణ అంశం విస్తృతంగా తెరపైకి వచ్చింది.

నాడు ప్రత్యేక రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడమా? హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయడమా? లేక రాయల సీమలోని జిల్లాలను తెలంగాణలో కలిపి రాయల తెలంగాణగా ఏర్పాటు చేయడమా? అనే అంశంపై చర్చ జరిగింది. అనేక చర్చలు సంప్రదింపుల అనంతరం తెలంగాణ ప్రాంతాన్ని తెలంగాణగా, ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలను కలిపి ఆంధ్రప్రదేశ్‌గా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన చేసింది. ఈ ప్రక్రియ ముగిసిన తొమ్మిదేళ్ల తర్వాత త్వరలో ఎన్నికలు జరగాల్సిన వేళ రాయలసీమను తెలంగాణలో కలపాలని జేసీ దివాకర్ రెడ్డి డిమాండ్ చేయడం సంచలనంగా మారింది.

Also Read..

వీళ్లు లేడీలా.. రౌడీలా..? షర్మిల, విజయమ్మలపై నెటిజన్లు ఫైర్

Advertisement

Next Story