- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Jagadish Reddy: సీఎం రేవంత్‌ను విమర్శించే మొగోడు బీజేపీలో లేడు
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో రైతాంగం పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(Jagdish Reddy) ఆవేదన చెందారు. ఆదివారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. దొంగ లెక్కలతో రుణమాఫీ చేశామని ప్రభుత్వం అంటోంది. రుణమాఫీని దేశం మొత్తం చెప్పుకునే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు రైతు భరోసా ఇవ్వాలని రైతులు మొత్తుకుంటున్నారని జగదీష్ రెడ్డి(Jagdish Reddy) అన్నారు. రైతులు పండించిన పత్తిని ప్రభుత్వం కొనడం లేదని చెప్పారు. వరి ధాన్యం కేంద్రాలు లేకపోవడంతో రైతులు ధాన్యం కల్లాల్లో ఆరబోసుకుంటున్నారని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటి వరకు మిల్లర్లతో చర్చలు చేయలేదు. కొనుగోళ్లపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేయలేదు. కొనుగోలు కేంద్రాల్లో గోనె సంచులు లేవని మండిపడ్డారు.
సన్న వరి ధాన్యానికి రూ.500ల బోనస్ ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. పత్తి రైతులను కాంగ్రెస్(Congress), బీజేపీ(BJP) పార్టీలు మోసం చేశాయని అన్నారు. ప్రభుత్వం సీసీఐ నుండి కిలో పత్తి కొనలేదు. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు ఇతర రాష్ట్రాల్లో ఎంజాయ్ చేస్తున్నారు. పక్క రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఫోర్త్ సిటీ, ఫిఫ్త్ సిటీ అంటూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు.. గ్రామీణ ప్రాంతాల్లో అడ్డగోలుగా విద్యుత్ కోతలు ఉన్నాయని అన్నారు. 2014కు ముందు తెలంగాణ ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉందని చెప్పారు. మళ్లీ నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ బారిన పడే పరిస్థితి వచ్చిందని చెప్పారు.
మోడీని సీఎం రేవంత్ రెడ్డి తిట్టినా బీజేపీ నేతలు సైలెంట్‌గా ఉన్నారు. రేవంత్ రెడ్డిని విమర్శించే మొగోడు బీజేపీలో లేడని కీలక వ్యాఖ్యలు చేశారు. రుణమాఫీపై తలో మాట మాట్లాడుతున్నారని అన్నారు. రైతు రుణమాఫీ అందరికీ కాలేదని వ్యవసాయ శాఖామంత్రి అంటున్నారు. రెండు లక్షల మందికి రుణమాఫీ అయిందని సీఎం రేవంత్ రెడ్డి దబాయిస్తున్నారు. రేవంత్ రెడ్డికి ముందుంది ముసళ్ళ పండగ. పరిపాలనలో రేవంత్ రెడ్డి నైజం బయటపడిందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీకి మూటలు పంపడంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పోటీ పడుతున్నారని ఎద్దేవా చేశారు.