వాళ్లతో కేసీఆర్ ఫోన్‌లో మాట్లాడుతున్నారు.. జగదీష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

by GSrikanth |
వాళ్లతో కేసీఆర్ ఫోన్‌లో మాట్లాడుతున్నారు.. జగదీష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ హక్కుల సాధనలో రాజీ పడబోమని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన దివాళా కోరుతనాన్ని పలు సందర్భాల్లో ప్రదర్శించిందన్నారు. సంక్షేమ పథకాల అమలులో దళారీ వ్యవస్థను తీసుకొచ్చే పనిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటుతామన్నారు. ప్రజాపాలన పేరిట దరఖాస్తుల స్వీకరణ నుంచి ఇప్పటి దాకా దీనిపై స్పష్టత లేదని, కాంగ్రెస్ ప్రభుత్వ లోపాలను ఎండగడతామన్నారు.

కేసీఆర్ కూడా కొంత మంది కార్యకర్తలతో ఫోన్‌లో మాట్లాడుతున్నారని, ప్రజలు కోరుకున్న రీతిలో బీఆర్ఎస్ పని చేస్తుందన్నారు. ప్రజల ఆకాంక్షలే పార్టీకి ముఖ్యం అన్నారు. తప్పుడు కేసుల బాధితులకు పార్టీ అండగా ఉంటుందన్నారు. పార్లమెంట్‌లో విభజన సమస్యలపై కొట్లాడిందే బీఆర్ఎస్ ఎంపీలు అన్నారు. కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు తెలంగాణ సమస్యలపై ఎప్పుడూ మాట్లాడలేదని, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు బీఆర్ఎస్‌కే ఉందన్నారు.

Advertisement

Next Story