- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి ప్రభుత్వాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీని కీలక నేతలు వీడుతున్నారు. ఈ క్రమంలో మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. కాగా ఆయన ఈ రోజు సాయంత్రం కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన బీఆర్ఎస్‌ను వీడుతున్నట్లు పలుమార్లు వార్తలు రాగా.. ఎట్టకేలకు ఈ రోజు బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా తాను బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా లేఖను ఇంద్రకరణ్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు పంపారు. గత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆయన తాజాగా రాజీనామా చేయడంతో.. ఇంద్రకరణ్ రెడ్డి ప్లేస్ లో స్థానంలో మరొకరికి బీఆర్ఎస్ ఇన్చార్జి బాధితులు అప్పగించారు.