- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రిపీట్ కాకుండా చూసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా: హరీష్ రావు
by GSrikanth |
X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వ హాస్టళ్లలో వరుసగా జరుగుతున్న ఫుడ్ పాయిజన్ సంఘటనలపై మాజీ మంత్రి హరీష్ రావు సోషల్ మీడియా(ఎక్స్) వేదికగా స్పందించారు. ‘‘మొన్న భువనగిరి గురుకుల హాస్టల్లో కలుషిత ఆహారం తిని చనిపోయిన ప్రశాంత్ ఉదంతాన్ని మరవక ముందే మరో ఫుడ్ పాయిజన్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండల కేంద్రంలోని కేజీవీబీ పాఠశాలలో శుక్రవారం 11 మంది విద్యార్థినులు కలుషిత ఆహారం తిని తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరారు. బీఆర్ఎస్ పాలనలో దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ గురుకులాల పట్ల కాంగ్రెస్ నిర్లక్ష్య వైఖరికి ఈ ఉదంతాలు అద్దం పడుతున్నాయి. ప్రభుత్వం వెంటనే బాధిత విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం’ అని హరీష్ రావు అన్నారు.
Advertisement
Next Story