- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Harish Rao: కేసీఆర్ వస్తాడు.. బాధలు తీరుస్తాడు
దిశ, వెబ్‌డెస్క్: పంద్రాగస్టు లోపే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) రైతులను నిలువునా మోసం చేసిందని మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) విమర్శించారు. మంగళవారం జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో జరిగిన మహా పాదయాత్రలో హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడి రైతులు, మహిళలతో ఆయన మాట్లాడారు. ‘కేసీఆర్ మళ్లీ వస్తాడు.. మీ బాధలు అన్నీ తీరుస్తాడు’ అని భరోసా ఇచ్చారు. మళ్లీ కేసీఆర్(KCR)ను అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత కూడా మీదే అని రైతులతో హరీష్ రావు(Harish Rao) చెప్పారు. కాంగ్రెస్ అంటేనే మోసం అని అన్నారు.
అబద్ధాలు చెప్పడంలో రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) రోజురోజుకు కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదని అన్నారు. దళితబంధు, కల్యాణలక్ష్మి, జాబ్ క్యాలెండర్ ఇలా ఎన్నో హామీలను అటకెక్కించారని విమర్శించారు. వీటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కేసీఆర్‌ను, బీఆర్ఎస్‌ను తిట్టే ప్రోగ్రామ్‌లు పెట్టుకున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్‌కు బూతులు తిట్టడం తప్పా పరిపాలన చేతకాదని విమర్శించారు.