- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పార్టీ మార్పు వార్తలపై స్పందించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి
దిశ, వెబ్‌డెస్క్: పార్టీ మార్పు వార్తలపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. చివరి వరకు బీఆర్ఎస్‌లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా కాంగ్రెస్, బీజేపీ పార్టీల్లో చేరబోను అని తేల్చి చెప్పారు. పార్టీని, కార్యకర్తలను కాపాడుకుంటా అని అన్నారు. కాగా, ఎన్నికల వేళ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి భారీ స్థాయిలో చేరికలు జరుగుతున్నాయి. ఇప్పటికే సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు హస్తం తీర్థం పుచ్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్‌ఎల్పీని కాంగ్రెస్‌లో వీలినం జరిగే వరకు చేరికలు ఉంటాయని వార్తలు సైతం వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు మాజీ మంత్రులు కాంగ్రెస్‌లో చేరబోతున్నారని వార్తలు హల్‌చల్ చేశాయి. ఈ జాబితాలో శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సబితా ఇంద్రారెడ్డి, కడియం శ్రీహరి సహా పలువురు ఉన్నారు. తాజాగా.. ఈ వార్తలకు చెక్ పెడుతూ ఎర్రబెల్లి పార్టీ మార్పు వార్తలను ఖండించారు.