- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ ఇంటిపై దాడి (వీడియో)
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ నగర మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ ఇంటిపై దాడి జరిగింది. ఈ సంఘటన మంగళవారం తెల్లవారుజామున వినాయక నగర్ లోని ఫస్ట్ మేయర్ స్ట్రీట్‌లో చోటు చేసుకుంది. మాజీ మేయర్ సంజయ్ ఇంటిపైకి రౌడీ షీటర్ సందీప్ వర్మ అలియాస్ చోర్ బబ్లూ మరొకరు దాడి చేశారు. తెల్లవారు జామున 6 గంటలకు సంజయ్ ఇంటి గేటు వద్ద తన కార్ తో గేటును ఢీ కొట్టి చొర్ బబ్లూ హంగామా చేశారు. సిబ్బందిపై దాడికి సందీప్ వర్మ పాల్పడ్డాడు. దాడికి గల కారణాలు తెలియరాలేదు. పోలీసులకు సిబ్బంది వెంటనే సమాచారం ఇవ్వడంతో నిందితులు పరారయ్యారు.
మాజీ మేయర్ సంజయ్ ఇంటి వద్ద హంగామా చేసిన సీసీ ఫుటేజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చోర్ బబ్లు నేమ్ ఫేమ్ పేరిట ఇప్పటికి పలువురు ప్రముఖులపై దాడులు కేసుల నమోదు అయ్యాయి. హైదరాబాద్ పార్క్ హయత్ వద్ద బౌన్సర్‌లపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన కేసులో చోర్ బబ్లు నిందితుడిగా ఉన్నాడు. నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి లోని నడిపల్లిలో సర్పంచ్ కారును పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన కేసులో చోర్ బబ్లు నగర బహిష్కరణ విధించారు. నగరం బహిష్కరణ ఉండడంతో గత కొంతకాలంగా నిజామాబాద్ నగరానికి చోర్ బబ్లూ దూరంగా ఉన్నాడు. మార్చి మొదటి వారంలో నార్సింగి పోలీస్ స్టేషన్లలో చోర్ బబ్లుపై కేసు నమోదు చేశారు. గడిచిన నెలలో నగర మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత జరుగుతున్న పరిణామాలు చర్చనీయాంశంగా మారుతున్నాయి.