- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కాంగ్రెస్‌లోకి రాజగోపాల్ రెడ్డి ఎంట్రీ.. చలమల కృష్ణారెడ్డికి బీజేపీ నుంచి ఆఫర్..?
దిశ, వెబ్‌డెస్క్: మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి సొంతగూటికి చేరుతున్నారు. రేపు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ తరపున మునుగోడు నుంచి పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. నేడే, రేపో విడుదల చేయనున్న రెండో జాబితాలో ఆయన పేరు ఉండే అవకాశముంది. రాజగోపాల్ రెడ్డి తిరిగి హస్తం గూటికి చేరుతుండటంతో మునుగోడులో కాంగ్రెస్ టికెట్‌పై ఆశలు పెట్టుకున్న చలమల కృష్ణారెడ్డి టెన్షన్‌లో పడ్డారు.
మునుగోడు సీటు దక్కకపోతే చలమల కృష్ణారెడ్డి బీజేపీలో చేరే అవకాశముందని టాక్ నడుస్తోంది. బీజేపీ నుంచి ఆఫర్ కూడా వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి చేరికపై చలమల కృష్ణారెడ్డి స్పందించారు. మునుగోడు టికెట్ తనకే వస్తుందని, రాజగోపాల్ రెడ్డి వేరే చోట నుంచి పోటీ చేయాలని సూచించారు. మునుగోడును ఈసారి తనకు వదిలేయాలని కోరుతున్నానని, రాజగోపాల్ రెడ్డి బలమైన నాయకుడు కాబట్టి ఎక్కడ నుంచి పోటీ చేసినా గెలుస్తారని అన్నారు. రాజగోపాల్ రెడ్డి కూడా తనకే సహకరిస్తారని అనుకుంటున్నానని, కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశానని చలమల కృష్ణారెడ్డి తెలిపారు .
రాజగోపాల్ రెడ్డి రాకను తాను స్వాగతిస్తున్నానని, ఆయన రాకతో నల్లగొండ జిల్లాలో పార్టీ మరింత బలపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాజగోపాల్ రెడ్డి బలమైన నాయకుడని కితాబిచ్చారు. ఎల్బీనగర్ నుంచి పోటీ చేయమని తనకు ఆఫర్ ఇచ్చారని, కానీ తనకు మునుగోడు సీటే కావాలని అన్నారు. ఖాళీగా ఉంటాను తప్ప వేరే సీటు నుంచి పోటీ చేయనని చలమల కృష్ణారెడ్డి స్పష్టం చేశారు.