మరో బీఆర్ఎస్‌ కీలక నేతకు అస్వస్థత.. యశోద ఆసుపత్రిలో చికిత్స

by GSrikanth |   ( Updated:2024-01-06 12:09:42.0  )
మరో బీఆర్ఎస్‌ కీలక నేతకు అస్వస్థత.. యశోద ఆసుపత్రిలో చికిత్స
X

దిశ, వెబ్‌డెస్క్: మరో బీఆర్ఎస్ కీలక నేత అస్వస్థతకు గురయ్యారు. కోరుట్ల మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అనారోగ్యానికి గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు గురువారం హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో జాయిన్ చేశారు. ఆయన్ను పరీక్షించిన వైద్యులు.. టెస్టుల అనంతరం గుండెకు స్టంట్ వేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఆసుపత్రిలోనే ఉన్న విద్యాసాగర్ రావు మెల్లగా కోలుకుంటున్నట్లు తెలుస్తోంది. విద్యాసాగర్ రావు ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, ఇప్పటికే మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవెల్లి ఫాంహౌజ్‌లోని బాత్రూములో కాలుజారి తీవ్రగాయాలన పాలైన విషయం తెలిసిందే. కేసీఆర్‌ కూడా యశోద ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు.

Read More..

కేసీఆర్‌కు తీవ్ర గాయాలు.. యశోద ఆసుపత్రిలో చికిత్స

ఆస్పత్రిలో KCR.. కవిత రియాక్షన్ ఇదే..!




Advertisement

Next Story

Most Viewed