- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘అలా చేసి ఉంటే నా సామిరంగా కథ మరోలా ఉండేది’.. మాజీ డీఎస్పీ నళిని పోస్ట్ వైరల్
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ఉద్యమ సమయంలో నా అన్నాచెల్లెళ్లపై లాఠీ ఝుళిపించలేనంటూ మాజీ డీఎస్పీ నళిని తన డీఎస్పీ కొలువునే వదిలేసుకుని సంచలనం సృష్టించిన సంగతి అందరికీ తెలిసిందే. ఉన్నత ఉద్యోగాన్ని వదిలి తెలంగాణ సాధన కోసం ఉద్యమం చేయడంతో అందరి దృష్టిని ఆమె ఆకర్షించింది. తెలంగాణ సాధించుకున్న తర్వాత ఆమెను గత కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదనే ఆరోపణలు వచ్చాయి. అయితే ఇటీవల తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం అయిన ఆమెను తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలని సోషల్ మీడియాలో పలువురు పోస్టులు చేశారు. దీంతో ఆమె మరోసారి వార్తల్లో నిలిచింది. కానీ ఆమె తన జీవన మార్గాన్ని ఆధ్యాత్మిక వైపు ఎంచుకున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే ఆమె సీఎం రేవంత్ రెడ్డిని ఇటీవల కలిసిన సంగతి తెలిసిందే.
తాజాగా మాజీ డీఎస్పీ నళిని ఫేస్‌బుక్ వేదికగా ఒక పోస్ట్ చేశారు. ‘నేను ఉద్యమం చేసినప్పుడు ఫేస్‌బుక్ ను ఇప్పటిలా వాడి ఉంటే, నా సామి రంగా కథ ఇంకో రకంగా ఉండి ఉండేది’ అని నళిని పేర్కొన్నారు. దీంతో ఆ పోస్ట్ వైరల్‌గా మారింది. నెటిజన్లు ఆమె పెట్టిన పోస్టుకు బాగా స్పందిస్తున్నారు. ‘ఉద్యమ కాలంలో కూడా ఫేస్ బుక్ ఉంది. కానీ ఫేస్ బుక్‌లో పోస్టులు, లైకులు, కామెంట్స్ పెట్టే వారు వీధుల్లో కనిపించేవారు కాదు’ అని నెటిజన్ కామెంట్ చేశారు. అప్పట్లో ఫేస్ బుక్ వాడి ఉంటే ఎంపీ అయ్యే వారు పక్కా.. అని మరో నెటిజన్ కామెంట్ చేశారు. ఉద్యమ (రాజకీయ) నాయకులు అయ్యేవారు మేడమని మరో నెటిజన్ స్పందించారు.