నేడు ఢిల్లీకి దామోదర్.. హైదరాబాద్‌కు థాక్రే

by GSrikanth |   ( Updated:2023-02-13 23:46:03.0  )
నేడు ఢిల్లీకి దామోదర్.. హైదరాబాద్‌కు థాక్రే
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్​సీనియర్​నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​మాజీ డిప్యూటీ సీఎం దామోదర్ రాజ నరసింహకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. దీంతో ఆయన మంగళవారం ఢిల్లికి వెళ్లనున్నారు. ఆకస్మికంగా కాంగ్రెస్​పెద్దల నుంచి సమాచారం రావడంతో ఇప్పుడు కాంగ్రెస్​ వర్గాల్లో హాట్​ టాఫిక్‌గా మారింది. వాస్తవానికి ఢిల్లీ అధిష్టానం నుంచి సీఎల్పీ, టీపీసీసీ ప్రెసిడెంట్‌లకు ఇన్ఫర్మేషన్​వస్తుంది. కానీ సీనియర్​నేతకు పిలుపు రావడంపై కొందరు కాంగ్రెస్​నేతలు ఏం జరగబోతున్నదో? అంటూ ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. దామోదర్​రాహుల్, ప్రియాంక గాంధీలతో భేటీ కానున్నట్లు తెలిసింది.

ఇదిలా ఉండగా.. గత కొన్ని రోజుల నుంచి దామోదర్​రాజనర్సింహా రేవంత్ ఫోన్లను కూడా లిఫ్ట్​చేయడం లేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఢిల్లీ నుంచి కబురు రావడం కొత్త చర్చకు తెరలేపింది. మరోవైపు ఏఐసీసీ తెలంగాణ వ్యవహరాల ఇంచార్జీ థాక్రే మంగళవారం హైదరాబాద్‌కు రానున్నట్లు సమాచారం. హాథ్ సే హాథ్ యాత్ర పరిస్థితులు, పార్టీ యాక్టివిటీస్, తాజాగా జరిగిన అసెంబ్లీ సమావేశాల తీరుపై ఆయన పార్టీ ముఖ్య నేతలతో చర్చించనున్నట్టు కాంగ్రెస్​పార్టీకి చెందిన ఓ కీలక నేత తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed