నిరోధ్‌లు అమ్ముకోమంటార్రా కుక్కల కొడకల్లారా?.. ఆగ్రహంతో ఊగిపోయిన కేసీఆర్

by GSrikanth |
నిరోధ్‌లు అమ్ముకోమంటార్రా కుక్కల కొడకల్లారా?.. ఆగ్రహంతో ఊగిపోయిన కేసీఆర్
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ సీఎం కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం కరీంనగర్‌ జిల్లాలో ఎండిన పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ మీడియాతో మాట్లాడారు. సిరిసిల్లలో బతుకమ్మ చీరల ఆర్డర్ల గురించి అడిగితే ఓ కాంగ్రెస్ నాయకుడు నిరోధ్‌లు అమ్ముకుని బతకాలని అంటున్నాడని సీరియస్ అయ్యారు. ‘చేనేత కార్మికులు ఎలా కనిపిస్తున్నార్రా? కుక్కల కొడుకా.. నిరోధ్‌లు అమ్ముకొని బతకాలా?’ అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చేనేత కార్మికుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడుతారా? అని ప్రశ్నించారు. మరోసారి రాష్ట్ర ప్రజలను, వృత్తులను అవమానించేలా మాట్లాడితే తరిమి తరిమి కొడతామని హెచ్చరించారు. బతుకమ్మ చీరలు, స్కూల్ దుస్తులు ఆర్డర్లు, బకాయిలు వెంటనే ఇవ్వాలని.. లేకుంటే బీఆర్ఎస్ పార్టీ ఫండ్‌‌ను లాయర్లకు ఫీజు ఇచ్చి హైకోర్టు ఈడుస్తామని హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో చేనేత కార్మికులు దొబ్బితిన్నారని మాట్లాడుతున్నారు.. దొబ్బితింటున్నది ఎవరో రాష్ట్ర ప్రజలకు తెలుసురా దొంగనాకొడకల్లారా? అని కేసీఆర్ ఘాటుగా మాట్లాడారు.

Advertisement

Next Story

Most Viewed