- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సాంప్రదాయనీ.. సుప్పినీ.. సుద్దపూసనీ! కేసీఆర్ వర్సెస్ రేవంత్ డైలాగ్ వార్!
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాలు తాజాగా ఆసక్తిగా మారాయి. లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ప్రధాన పార్టీలు మెజరిటీ గెలుపు లక్ష్యంతో పోటిపడుతున్నాయి. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీల నేతలు తీవ్ర స్థాయిలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ నేతల మధ్య పెద్ద యుద్ధం జరుగుతున్నట్లు డైలాగ్ వార్ నడుస్తోంది.
అయితే ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్లో బాస్, మాజీ సీఎం కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ‘రండ’కేసీఆర్ అంటూ సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కాంగ్రెస్‌పై విరుచుకపడ్డాయి. ఒక రాష్ట్రానికి సీఎం అయి ఉండి అలాంటి భాష వాడొచ్చా అని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. దీంతో కేసీఆర్ కూడా గతంలో ప్రెస్ మీట్లలో బూతులు మాట్లాడారని, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ‘రండ’ అని తిట్టిన వీడియోలు కాంగ్రెస్ శ్రేణులు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాయి. దీంతో అవి వైరల్‌గా మారాయి.
సాంప్రదాయనీ.. సుప్పినీ.. సుద్దపూసనీ అంటూ గత కేసీఆర్ కామెంట్స్ పెట్టారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ తీవ్రస్థాయిలో అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే గతంలో కేసీఆర్, నేడు సీఎం రేవంత్ రెడ్డి ఆ పదాలు మాట్లాడటం పై నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.