TELANGANA: చరిత్రలో మొదటిసారి.. కనివిని ఎరగని రితీలో భారీ వర్షపాతం నమోదు

by Anjali |
TELANGANA: చరిత్రలో మొదటిసారి.. కనివిని ఎరగని రితీలో భారీ వర్షపాతం నమోదు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది. కుండపోత వర్షం కారణంగా నేషనల్ హైవేలు చెరువులను తలపిస్తున్నాయి. వాహనాలు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. పలుచోట్ల కొండచరియలు కూడా విగిపడుతున్న పరిస్థితి నెలకొంది. భారీ వర్షంతో పాత భవనాలు కూలిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులకు భారీ వరద పోటెత్తుంది. నది పరీవారక ప్రాంతాలకు వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తుంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని తెలంగాణ కలెక్టర్ సూచించారు. కుండపోత వర్షాల కారణంగా విద్యాసంస్థలకు సెలవులు కూడా ప్రకటించారు. అధికారులు, సిబ్బందిని అప్రమత్తం చేశారు. తెలంగాణలో మొట్టమొదటిసారిగా రికార్డు స్థాయిలో నమోదైన వర్షపాతం నమోదు చూసినట్లైతే.. హుజూర్‌నగర్-29. 9 సెంటి మీటర్లు, చిలుకూరు 29. 7 సెం. మీ, మట్టంపల్లె - 28. 1 సెం. మీ, ముకుందపురం 27. 9 సెం. మీ. మద్దిరాల 24. 5 సెం. మీ, మోతె, 24. 4 సెం. మీ, కోదాడ 21. 4 సెం. మీ, సూర్యాపేట 20. 6 సెం. మీ, ఇనుగుర్తి 29. 8, కొమ్ములవంచ-29. 5, దంతాలపల్లె-29. 5, మల్యాల-29. 4, గచ్చిబౌలి-7. 5 సెం. మీ, జీహెచ్‌ఈఎల్-7. 3, హైదర్‌నగర్-7. 3 సెం. మీ, ఖైరాతాబాద్- 6. 8 సెం. మీ వర్షపాతం నమోదు అయ్యింది.

Advertisement

Next Story

Most Viewed