Food Safety: ప్రముఖ హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడి.. ఆ దృశ్యాలు చూస్తే చచ్చినా తినరు..

by Y.Nagarani |   ( Updated:2024-11-07 07:39:56.0  )
Food Safety: ప్రముఖ హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడి.. ఆ దృశ్యాలు చూస్తే చచ్చినా తినరు..
X

దిశ, వెబ్ డెస్క్: బయటి ఫుడ్ తినేవారికి ఇది నిజంగా షాకింగ్ న్యూసే. ఎక్కడ చూసినా అపరిశుభ్ర వాతావరణమే కనిపిస్తోంది. కనీస నియమాలు పాటించకుండా.. ఫుడ్ స్టాల్స్ నిర్వాహకులు, రెస్టారెంట్లు, హోటళ్ల నిర్వాహకులు ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు. పాడైన, కుళ్లిన, కల్తీ ఆహార పదార్థాలతో తయారు చేసిన వాటిని విక్రయించి లాభాలను ఆర్జిస్తున్నారు. కిచెన్ లో అపరిశుభ్ర వాతావరణం.. కీటకాలు తిరుగుతున్నా నియంత్రణ చర్యలు లేకుండా.. వాటిని కూడా కలిపి ఆహారాన్ని వండేస్తున్నారు. టేస్ట్ బాగుందని వాటిని తిన్నవారు మాత్రం ఆస్పత్రుల పాలై.. వేలకు వేలు బిల్లులు కడుతున్న పరిస్థితి. ప్రజల ఆరోగ్యమంటే మరీ ఇంత లోకువ. లాభాలపై ఉన్న శ్రద్ధ.. పరిశుభ్రతపై ఎందుకు ఉండట్లేదు ?

అడపా దడపా పలు రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లపై దాడులు చేస్తున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు.. తాజాగా శ్రీ రాఘవేంద్ర(Sri Raghavendra), ఉడిపి, సంతోష్ (Santosh Hotels)హోటళ్లలో తనిఖీలు నిర్వహించారు. ఆయా హోటళ్ల కిచెన్లలో బొద్దింకలు రాజ్యమేలుతున్నట్లు గుర్తించారు. గడువు చెల్లిన ఆహార పదార్థాలను ఆహారాల తయారీకి వాడుతున్నట్లు చూసిన అధికారులు.. షాకయ్యారు. కుళ్లిన కూరగాయలతో వంటలు చేస్తున్నట్లు తెలుసుకుని నిర్వాహకులపై ఫైరయ్యారు. ఫంగస్ వచ్చిన అల్లంతోనే వంటలు చేస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి ఆహారాలను తిని ప్రజలు తరచూ అనారోగ్యాల బారిన పడుతున్నారని మండిపడ్డారు.

మూసాపేట్ లోని కృతుంగ రెస్టారెంట్లో(Krutunga Restaurant)నూ తనిఖీలు చేయగా.. కిచెన్ లో బొద్దింకలు ఉన్నట్లు గుర్తించారు. కిచెన్ పరిసరాలు సైతం అపరిశుభ్రంగా ఉన్నాయని పేర్కొన్నారు. రెస్టారెంట్ పై చర్యలు తీసుకుంటామన్నారు. మరోవైపు నిజామాబాద్ గ్రిల్ నైన్ రెస్టారెంట్లో ఇటీవల భోజనం చేసిన బైగా అనే యువతి ఫుడ్ పాయిజన్ కు గురై మరణించింది. దీంతో అధికారులు రెస్టారెంట్ పై తనిఖీలు నిర్వహించారు.

Advertisement

Next Story