Minister'sTummala : నిబంధనలు పాటించండి..మద్ధతు ధర పొందండి : రైతులకు మంత్రి తుమ్మల సూచన

by Y. Venkata Narasimha Reddy |
MinistersTummala : నిబంధనలు పాటించండి..మద్ధతు ధర పొందండి : రైతులకు మంత్రి తుమ్మల సూచన
X

దిశ, వెబ్ డెస్క్ : ధాన్యం(Paddy)విక్రయించే రైతులు కొనుగోలు నిబంధనల(Follow rules)మేరకు తమ ధాన్యాన్ని శుభ్రంగా ఆరబెట్టి, తుర్పారబట్టి మద్ధతు ధర(Get support)పొందాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు (Tummala Nageshwar Rao)సూచించారు. సూర్యాపేట జిల్లా టేకుమట్ల జాతీయ రహదారి మీదుగా వెలుతూ స్థానిక ఐకెపీ కేంద్రాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సందర్శించి ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. ధాన్యం అమ్మకంలో రైతులు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. ఎకరాకు ఎన్ని బస్తాల దిగుబడి వస్తుందని రైతును ఆడుగగా భూమి, విత్తనం, వాతావరణ పరిస్థితులను బట్టి 40నుంచి 60బస్తాల వరకు వస్తుందని మంత్రికి వివరించాడు.

భగవంతుడి దయ వల్ల పంట బాగా పడిందని, రైతులు మద్ధతు ధర అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని మంత్రి తుమ్మల చెప్పారు. వరి కోతలు పూర్తయ్యాక పంట చేనులలో వరి గడ్డికి, కొయ్యలకు నిప్పు పెట్టవద్దని సూచించారు. నిప్పు పెట్టడం వల్ల భూమి సారం కోల్పోతుందన్నారు. వరి కోతల అనంతరం కల్టివేటర్ తో దున్నించడం మంచిదన్నారు.

Advertisement

Next Story

Most Viewed