- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
అదిరిపోయిన గద్దర్ న్యూ లుక్.. పూర్తిగా మారిన హెయిర్ స్టైల్

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రజా యుద్ధనౌక గద్దర్ నయా లుక్‌లో కనిపించారు. ఒక్కసారిగా తన హెయిర్ స్టైల్ చేంజ్ చేసి అందరికీ షాకిచ్చారు. షార్ట్ హెయిర్‌తో పాటు తెల్ల జుట్టుకు రంగు వేసి ఆశ్చర్యపరిచారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన ఆయన, ఎవరూ గుర్తు పట్టలేని గెటప్‌లో కనిపించడంతో అంతా షాకయ్యారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను ప్రజా యుద్దనౌక గద్దర్ కలిశారు. ఢిల్లీలో కొత్తగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవనం(సెంట్రల్ విస్టా)కు అంబేద్కర్ పేరు పెట్టాలని కోరుతూ గద్దర్ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ కూడా నయా లుక్‌లో కనిపిస్తున్నారంటూ గద్దర్‌పై కామెంట్స్ చేశారు. ఇదిలావుండగా ఇటీవల కాలంలో గద్దర్ బీజేపీ సభలు, సమావేశాలకు హాజరవుతున్న విషయం తెలిసిందే. రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా తుక్కుగూడలో నిర్వహించిన భారీ బహిరంగ సభకు హాజరయ్యారు. ఈ సభకు ముఖ్య అతిథిగా వచ్చిన అమిత్ షా కు తనపై ఉన్న అక్రమ కేసులను ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు. తాజాగా బండి సంజయ్‌ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. గద్దర్ వెంట ఆల్ ఇండియా ఎస్సీ, ఎస్టీ ఆర్గనైజేషన్ నాయకులు ఉన్నారు.