- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
జీహెచ్ఎంసీ పరిధిలోని ట్రాఫిక్ సమస్యలపై ఫోకస్ పెట్టండి : పోలీసు ఉన్నతాధికారుల సమీక్షలో డీజీపీ
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో : జీహెచ్ఎంసీ పరిధిలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి విస్తృత స్థాయిలో చర్యలు చేపట్టాల్సిన అవసరముందని డీజీపీ రవి గుప్తా అన్నారు. ఆ దిశగా అధికారులు దృష్టిని కేంద్రీకరించాలని ఆదేశించారు. గ్రేటర్హైదరాబాద్లోని ట్రాఫిక్ పరిస్థితిపై డీజీపీ రవి గుప్తా ఇవాళ తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల ట్రాఫిక్ ఇబ్బందుల పరిష్కారానికి, ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు చేపట్టాల్సిన చర్యలపై సూచనలు చేయాల్సిందిగా పేర్కొన్నారు. విజిబుల్ పోలీసింగ్‌ను సమర్థవంతంగా అమలు చేయటంతో పాటు ట్రాఫిక్ సిబ్బందికి ఆధునిక శిక్షణ అందించాల్సి ఉందని అన్నారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కొత్త స్కైవాక్స్, ఫ్లై ఓవర్లతో పాటు ఇతర ట్రాఫిక్ పరిస్థితులను వివరిస్తూ.. అధికారులు పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా డీజీపీకి వివరించారు. మూసీ పరివాహక ప్రాంతంలోని వంతెనల పరిస్థితి, ప్రతిపాదిత ట్రాఫిక్ అవగాహన కార్యక్రమాలు, శిక్షణా కేంద్రాల ఏర్పాటు గురించి తెలియ చేశారు. కాగా, సమావేశంలో వచ్చిన వేర్వేరు సిఫార్సులను వెంటనే అమల్లోకి తీసుకురావాలని ఆయన అధికారులకు సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో ఇంటెలిజెన్స్ ఛీఫ్ బి.శివధర్‌రెడ్డి, అదనపు డీజీపీ సంజయ్‌కుమార్ జైన్, సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి, రాచకొండ కమిషనర్ సుధీర్‌బాబు, హైదరాబాద్ అదనపు కమిషనర్ విక్రమ్‌సింగ్ మాన్, హైదరాబాద్ అదనపు కమిషనర్(ట్రాఫిక్) విశ్వప్రసాద్, ఐజీ తరుణ్ జోషీ, తదితరులు పాల్గొన్నారు.
- Tags
- traffic problems