- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
సమస్యాత్మక ప్రాంతాలపై దృష్టి పెట్టండి : సీఎం రేవంత్ రెడ్డి
దిశ, తెలంగాణ బ్యూరో : వినాయక నిమజ్జనం నేపథ్యంలో సమస్యాత్మక ప్రాంతాలపై ఎక్కువ దృష్టి పెట్టాలని పోలీసు శాఖ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. నిమజ్జనం ఏర్పాట్లు, పర్యవేక్షణపై కమాండ్ కంట్రోల్ సెంటర్ లో హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, ఇతర పోలీస్ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా 733 సీసీ కెమెరాలతో నిమజ్జన ప్రక్రియను పర్యవేక్షిస్తున్నట్లు సీఎంకు సీపీ సీవీ ఆనంద్ వివరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ట్యాంక్ బండ్ తో పాటు ప్రధాన మండపాలు, చెరువుల వద్ద ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలని సూచించారు. పర్యవేక్షణతో పాటు ప్రతి గంటకొకసారి సిబ్బందికి కమాండ్ కంట్రోల్ నుంచి సూచనలు ఇచ్చి అలెర్ట్ చేయాలని తెలిపారు. బ్లైండ్ స్పాట్స్, హాట్ స్పాట్స్ లకు సంబంధించి రికార్డు మెయింటెన్ చేయాలని ఆదేశించారు.ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్ధేశం చేశారు.