- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కారు.. రివర్స్ గేర్.. ఎంపీ ఎన్నికల కోసం గులాబీ బాస్ కీలక నిర్ణయం!
దిశ, డైనమిక్ బ్యూరో : పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్న నేపథ్యంలో గులాబీ బాస్ కేసీఆర్ పార్టీ స్ట్రక్చరల్ మార్పులపై ఫోకస్ పెట్టారు. ఈ మేరకు నిన్నటి వరకు పార్టీ ఆఫీస్ తెలంగాణ భవన్‌లో వాస్తు మార్పులకు శ్రీకారం చుట్టగా తాజాగా పార్టీ పేరు మార్పుపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై తాజాగా ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ పార్టీ పేరును తిరిగి టీఆర్ఎస్‌గా మారుస్తామని, దీనికోసం కసరత్తు కూడా జరుగుతోందని వ్యాఖ్యానించారు. ఈ నెలలోనే ఈ అనౌన్స్ మెంట్ ఉండబోతున్నదనే చర్చ గులాబీ పార్టీలో జోరుగా వినిపిస్తోంది. క్లిష్టపరిస్థితుల్లో వెనుకడుగు వేయడం తప్పేమీ కాదనే అభిప్రాయంతో బీఆర్ఎస్ స్థానంలో తిరిగి టీఆర్ఎస్ పేరును ప్రకటించేందుకు సమాయత్తం అవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది.
పార్టీ ఆవిర్భావ సభలోనే..
అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలైంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కేసీఆర్ కూతురు కవిత అరెస్ట్ అయ్యారు. పలువురు సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారు. వీటికితోడు గతంలో అధికారంలో ఉండగా తీసుకున్న నిర్ణయాలు ఒక్కొక్కటిగా మెడకు చుట్టుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇలా వరుస దెబ్బలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కేసీఆర్ ఎంపీ ఎన్నికల్లో పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలంటే మేజర్ డెసిషన్స్ తీసుకోక తప్పదనే అభిప్రాయానికి వచ్చారని, ఇందులో భాగంగానే పార్టీ నేమ్ ప్లేట్‌లోనూ మార్పులు చేయబోతున్నారని తెలుస్తోంది. తాజా పరిణామాలను బట్టి చూస్తే ఈ నెల 27న జరగబోయే పార్టీ ఆవిర్భావ సభలోనే ఈ ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
కలిసిరాని నేషనల్ పాలిటిక్స్..
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుదామనే భావనతో టీఆర్ఎస్ స్థానంలో బీఆర్ఎస్ పేరును ప్రకటించిన నాటి నుంచి కేసీఆర్‌కు అన్ని రివర్స్ అవుతూనే ఉన్నాయి. నిజానికి పార్టీ పేరు మార్పు పరిణామం ప్రతిపక్షాలు ఆయుధంగా మలుచుకున్నాయి. తెలంగాణతో గులాబీ పార్టీకి పేగు బంధం తెగిపోయిందని పెద్దఎత్తున ప్రచారం చేశాయి. అయితే గతంలో ఎన్నికల్లో గెలుపు కోసం కేసీఆర్ యజ్ఞాలు, పూజలను నమ్ముకునే వారని కానీ ప్రస్తుత పరిస్థితుల కారణంగా వాస్తు, పేరు మార్పును నమ్ముకుంటురనే చర్చ పొలిటికల్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.