ప్రగతిభవన్ ఎదుట ఫ్లెక్సీల కలకలం.. ఆ కామ పిశాచి ఎమ్మెల్యే నుండి కాపాడాలంటూ పోస్టర్స్!

by Satheesh |   ( Updated:2023-05-19 04:32:33.0  )
ప్రగతిభవన్ ఎదుట ఫ్లెక్సీల కలకలం.. ఆ కామ పిశాచి ఎమ్మెల్యే నుండి కాపాడాలంటూ పోస్టర్స్!
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో మరోసారి ఫ్లెక్సీలు కలకలం రేపాయి. గతంలో బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య ఫ్లెక్సీ వార్ జరగగా.. ఈ సారి ఏకంగా అధికార పార్టీ బెల్లంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ప్రత్యక్షం అయ్యాయి. శుక్రవారం నగరంలోని బీఆర్ఎస్ భవన్, ప్రగతి భవన్ ఎదుట ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి.

అంతేకాకుండా హైదరాబాద్‌లో మరో 25 చోట్ల ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు వ్యతిరేకంగా గుర్తు తెలియని వ్యక్తులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ‘‘మాకు న్యాయం చేయండి. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు, మీడియా సంస్థల అధినేతలకు విన్నపం. స్త్రీలకు రక్షణ కల్పించాలి, బాధితులకు న్యాయం చేయాలి. దుర్గం చిన్నయ్య లాంటి కామ పిశాచి బారి నుండి బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలను కాపాడండి.. ఆరిజిన్ డైరీ’’ అంటూ ఆ పోస్టర్లో రాశారు.

ఎమ్మెల్యే నుండి తమకు న్యాయం చేయాలంటూ ఆరిజన్ డెయిరీ పేరిట పలు చోట్ల ఫ్లెక్సీలు ప్రత్యక్షం అయ్యాయి. కాగా, గత మూడు నెలలుగా ఆదిలాబాద్ జిల్లాకు ఆరిజన్ డెయిరీ, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మధ్య వివాదం జరుగుతోన్న విషయం తెలిసిందే. దుర్గం చిన్నయ్య తమను వేధిస్తున్నాడంటూ ఆరిజన్ డెయిరీకి చెందిన ఓ మహిళ సంచలన ఆరోపణలు చేసింది.

ఈ ఆరోపణలను ఎమ్మెల్యే ఖండించగా.. అప్పటి నుండి వీరి మధ్య వివాదం జరుగుతోంది. ఇదిలా ఉండగానే.. రాత్రికే రాత్రే నగరంలో పలు చోట్ల అధికార పార్టీ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పోస్టర్స్ ప్రత్యక్షం అవ్వడం సంచలనంగా మారింది. ఏకంగ ఫుల్ సెక్యూరిటీ ఉంటే ప్రగతి భవన్, తెలంగాణ భవన్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు పోస్టర్ల వెలియడం రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది.

Advertisement

Next Story