అశ్వారావుపేట నియోజకవర్గానికి ఐదు షాదీఖానాలు..?

by Sathputhe Rajesh |   ( Updated:2023-03-21 04:33:05.0  )
అశ్వారావుపేట నియోజకవర్గానికి ఐదు షాదీఖానాలు..?
X

దిశ, దమ్మపేట: త్వరలో నియోజకవర్గంలో ఉన్న ముస్లిం మైనార్టీలకు ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు తీపి కబురు చెప్పనున్నారు. నియోజకవర్గంలో ఐదు మండలాల్లో షాదీ ఖానాలు నిర్మాణం చేపట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు 2018 ఎన్నికలలో టీడీపీ నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా తాను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో ముస్లిం సోదరులు వివాహాలు చేసుకోవడానికి షాదీ ఖానాలు నిర్మిస్తానని మాట ఇచ్చారు.

ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఇటీవల అసెంబ్లీ సమావేశాలకు హైదరాబాద్ వెళ్లిన సమయంలో ఎస్సీ, గిరిజన, బీసీ మైనార్టీ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను కలిసి తన నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో షాదీఖానాలు నిర్మాణాలు చేపట్టాలని కోరారు. దీంతో మైనార్టీ సంక్షేమ శాఖ నుండి జిల్లా ఉన్నత అధికారులకు ఐదు మండలాలలో ఉర్దూగర్ మరియు షాదీ ఖానా నిర్మాణాలకు నివేదిక తయారుచేసి, ప్రణాళిక అంచనాలు పంపించాల్సిందిగా ఉత్తర్వులు అందాయి. త్వరలోనే ముస్లిం మైనార్టీలకు ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు తీపికబురు చెప్పనున్నారు.

Advertisement

Next Story

Most Viewed