అనుమానస్పద స్థితిలో ఎర్ర చెరువులో చేపలు మృతి

by Prasanna |
అనుమానస్పద స్థితిలో ఎర్ర చెరువులో చేపలు మృతి
X

దిశ, పెన్ పహాడ్ : మండలంలోని లింగాల గ్రామానికి చెందిన ఎర్ర చెర్వులో అనుమానస్పద స్థితిలో చేపలు మృతి చెందిన సంఘటన శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.గ్రామానికి చెందిన మాత్యకారులు అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత కొద్దికాలం క్రితం చేప పిల్లలను అందించగా వాటిని చెరువులో పోసి పెంచుతూ ఆ చెరువును కొందరు గుత్తే దారులకు కొంత మొత్తానికి పాట రూపంలో లీజుకు ఇవ్వగా గుత్తెదారులు ప్రభుత్వం అందించిన చేపలతో పాటు మరికొంత మేలురకం చేపలను పెంచుతుండగా అవి సుమారు కేజీ నుండి కేజిన్నర వరకు పెరిగాయి కానీ ఈ చేపల పెంపకానికి సుమారు 3 నుండి 4 లక్షల వరకు పెట్టుబడి పెట్టామని ఎవరో కొందరు కావాలనే చెరువులో విష ప్రయోగం చేసి 4 నుండి 5 టన్నుల చేపలు మృతి చెందడానికి కారకులై ఉంటారని గుత్తే దారులు ఆవేదన చెందుతున్నారు. విష ప్రయోగం జరగక పొతే చేపలతో పాటు పాములు ఎలా చనిపోతాయని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటన గత మూడు రోజుల క్రితమే జరిగి ఉంటుందని గత రెండు రోజులుగా చెరువులో ఉన్న చెపలన్ని మృతి చెందాయని గుత్తే దారులు ఆందోళనకు గురౌతున్నారు తమకు సుమారు 6 లక్షల పంట నష్టం సంబవించిందని మీడియాతో తమ గోడును విన్న వించుకున్నారు. ఈ సంఘటనపై పోలిసులకు పిర్యాదు చేయగా.. చెరువును పరిశీలించి వెళ్లినట్లు తెలిపారు. చెరువులో నీరు విషతుల్యం కాకుండా చెరువులోని నీటిలో నీరుసున్నం జల్లించినట్లు గుత్తే దారులు తెలిపారు కారకులెవరైనా వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకొని ప్రభుత్వం తమను ఆదుకోవాలని గుత్తే దారులు కోరుతున్నారు.

Advertisement

Next Story