రాష్ట్ర సచివాలయంలో గద్దర్ సినీ అవార్డుల కమిటీ మొదటి సమావేశం

by Mahesh |
రాష్ట్ర సచివాలయంలో గద్దర్ సినీ అవార్డుల కమిటీ మొదటి సమావేశం
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రజాగాయకుడు, తెలంగాణ ఉద్యమ కారుడు గద్దర్(Gaddar) ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. కాగా ఆయన తెలంగాణ పోరాటంలో చేసిన కృషిని గుర్తుంచుకునేలా.. రాష్ట్ర ప్రభుత్వం టాలీవుడ్ ఇండస్ట్రీలో.. గద్దర్ సినీ అవార్డులు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం పలువురు ప్రొడ్యూసర్లు, సినీ ప్రముఖులతో కలిసి ఓ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. కాగా ఈ రోజు రాష్ట్ర సచివాలయంలో గద్దర్ సినీ అవార్డుల(Gaddar Cine Awards) కమిటీ మొదటి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) అధ్యక్షత జరగ్గా.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ అంటేనే ఆట, పాట ఈ తెలంగాణ ఆట, పాటను ప్రపంచానికి పరిచయం చేసిన మహోన్నత వ్యక్తి గద్దర్, తెలంగాణ సినీ పరిశ్రమను రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున గౌరవిస్తుంది. తెలుగు పరిశ్రమ ప్రపంచ స్థాయికి ఎదగాలని భట్టి చెప్పుకొచ్చారు. కాగా ఈ సమావేశంలో సీనియర్ నటుడు తనికెళ్ల భరణి, ప్రొడ్యూసర్ సురేష్ బాబు, దిల్ రాజు, డైరెక్టర్ హరీష్ శంకర్, సంగీత దర్శకుడు సుద్దాల అశోక్ తేజ. గద్దర్ సినీ అవార్డుల కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కాగా ఈ మొదటి మీటింగ్ లో ఎటువంటి విషయాలపై చర్చించారనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story

Most Viewed