మానకొండూరులో కాల్పుల కలకలం..

by Sathputhe Rajesh |   ( Updated:2023-04-20 07:25:02.0  )
మానకొండూరులో కాల్పుల కలకలం..
X

దిశ, మానకొండూరు : మానకొండూర్ లో కాల్పులు కలకలం రేపాయి. మండల కేంద్రంలో బుధవారం అర్ధరాత్రి గ్రామానికి చెందిన బాశబోయిన అరుణ్ యాదవ్ అనే రౌడీషీటర్‌పై గోదావరిఖనికి చెందిన నలుగురు రౌడీషీటర్లు కాల్పులు జరపడం సంచలనం సృష్టించింది. అరుణ్ ఇంట్లోకి చొరబడి చితక బాధడంతో దెబ్బలు తట్టుకోలేక సదరు వ్యక్తి పారిపోతుండగా కాల్పులు జరిపారు. అయితే ఆ వ్యక్తికి బుల్లెట్ తాకకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

పక్కింట్లో ఉంటున్న రోల్ల మల్లయ్య అనే వ్యక్తి ఇంట్లోకి రౌడీ షీటర్ చొరబడటంతో మళ్లీ రౌడీ షీటర్లు దాడి చేసి, ఇంట్లో వస్తువులన్నీ ధ్వంసం చేశారు. ఈ దాడిలో అరుణ్‌తో పాటు మరో ఎనిమిది మందికి గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. రౌడీషీటర్ అరుణ్‌ను కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. రౌడీ షీటర్ల మధ్య ఉన్న పాత కక్షలతోనే దాడి జరిగినట్టు గ్రామస్తులు తెలిపారు. నలుగురు రౌడీ షీటర్లలో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మానకొండూరులో అర్ధరాత్రి కాల్పులు జరగడంతో గ్రామస్తులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు.

Advertisement

Next Story

Most Viewed