- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రొఫెసర్ సాయిబాబాకు తుది వీడ్కోలు.. ఉద్యమ పాటలు, డప్పు చప్పుళ్ల మధ్య అంతిమయాత్ర
దిశ, డైనమిక్ బ్యూరో: పౌర హక్కుల నేత, ఉద్యమకారుడు, రచయిత, విద్యావేత్త, మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాకు పౌరహక్కుల నేతలు తుది వీడ్కోలు పలికారు. సోమవారం మధ్యాహ్నం మౌలాలి నుంచి ప్రారంభమైన అంతిమయాత్రలో పెద్ద ఎత్తున ప్రజలు, పౌర హక్కుల నేతలు, వామపక్షల నేతలు పాల్గొన్నారు. డప్పు చప్పుళ్లు, పాటలు, నినాదాలతో ఆయనకు నివాళులు అర్పించారు.
రాజ్యమే తనను చంపిందని, ఉపా చట్టాన్ని రద్దు చేయాలని పౌర హక్కుల నేతలు హోరెత్తించే నినాదాలతో ర్యాలీ సాగింది. యాత్ర అనంతరం ఆయన చివరి కోరిక మేరకు కుటుంబ సభ్యులు గాంధీ మెడికల్ కాలేజీకి పార్థివ దేహాన్ని అప్పగించారు. ఇప్పటికే ఆయన కళ్లను ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రికి డొనేట్ చేశారు. కాగా, అనారోగ్య సమస్యలు, గుండెపోటుతో శనివారం రాత్రి ప్రొఫెసర్ సాయిబాబా కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మౌలాలి లోని నివాసంలో ఆయన పార్థీవ దేహానికి రాజకీయ నేతలు, ప్రజాసంఘాల నేతలు నివాళులు అర్పించారు.