- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Chamala: పండుగ రోజూ విష ప్రచారమే.. పత్రికపై చర్యలు తీసుకోండి: ఎంపీ రిక్వెస్ట్
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రభుత్వం(Telangana Govt)పై విష ప్రచారం చేస్తున్న దిన పత్రిక(News Paper)పై చర్యలు తీసుకోవాలని భువనగిని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి(Chamala Kirankumar Reddy) కోరారు. దిన పత్రికలో వచ్చిన వార్తపై స్పందిస్తూ.. సోషల్ మీడియా వేదికగా వీడియో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన.. అందరికీ దీపావళి శుభాకాంక్షలు(Diwali Wishes) అంటూ.. పండుగ రోజు కూడా ప్రభుత్వంపై ఓ పత్రిక విష ప్రచారం చేస్తున్నదని వ్యాక్యానించారు. ఇందులో ల్యాండ్ పూలింగ్(Land Pooling) పేరుతో తన పేరు ప్రస్తావించకుండా ఇటీవల విదేశాలకు వెళ్లి వచ్చిన ఎంపీ అని ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు.
అలాగే ఒక పేపర్ నడుపుతున్నప్పుడు ప్రామాణికతలు పాటించాలని సూచించారు. దీనిపై ఎంక్వైరీ(Enquiry) చేయాలని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), డీజీపీ(Telangana DGP)లను కోరారు. ప్రజలకు చిత్తశుద్ది ఉన్న పాలనను అందించాలని, రేవంత్ రెడ్డి ఫోర్త్ సిటీ(Fourth City)ని తీసుకొచ్చి హైదరాబాద్ అభివృద్ది(HYD development) చేయాలని సంకల్పించారని తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు(BRS Leaders) గత పదేళ్లలో చేయని పాలనను కాంగ్రెస్ ప్రభుత్వం 10 నెలల్లోనే చేస్తున్నందుకు ఓర్వలేక ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై ఎంక్వైరీ చేసి, ప్రజలకు నిజనిజాలు తెలియజేయాల్సిన అవసరం ఉందని, ఇది అవాస్తవం అయితే ఈ పత్రికపై చర్యలు తీసుకోవాలని అన్నారు. దీనిపై ఇప్పటికే ఎక్స్(X) వేదికగా ఫిర్యాదు(Complaint) చేశానని, త్వరలో రాత పూర్వకంగా కూడా ఫిర్యాదు అందజేస్తానని చామల తెలిపారు.