AISF : ఫీజు రియంబర్స్‌మెంట్‌ విడుదల చేయాల్సిందే.. సచివాలయం ముట్టడికి యత్నించిన ఏఐఎస్ఎఫ్

by Ramesh N |   ( Updated:2024-10-26 09:41:54.0  )
AISF : ఫీజు రియంబర్స్‌మెంట్‌ విడుదల చేయాల్సిందే.. సచివాలయం ముట్టడికి యత్నించిన ఏఐఎస్ఎఫ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో విద్యార్థుల ఫీజు రియంబర్స్‌మెంట్‌ (Fee Reimbursement) విడుదల చేయాలని చలో సచివాలయానికి ఏఐఎస్ఎఫ్ (AISF) పిలునిచ్చింది. ఈ క్రమంలోనే తెలంగాణ సచివాలయం (Secretariat) వద్ద ఉద్రిక్తత వాతావరణ చోటుచేసుకంది. ఫీజు రియింబర్స్‌మెంట్‌ బకాయిలను విడుదల చేయాలంటూ ఏఐఎస్‌ఎఫ్‌ విద్యార్థి సంఘం నేతలు సెక్రటేరియట్‌ ముట్టడికి యత్నించారు. పోలీసులు వెంటనే వారిని అడ్డుకుని.. అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పది నెలల కాలంలో రాష్ట్రంలో విద్యా వ్యవస్థ నిర్వీర్యమైందని విద్యార్థులు విమర్శించారు. కంచెలు తొలగించాం అని చెప్పారు కానీ ఇవాళ పోలీస్‌లు ఎక్కడికికి అక్కడ అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

ఫీజు రియంబర్స్‌మెంట్‌ విడుదల చేయక పోవడంతో చాలా కాలేజీలు మూసి వేస్తున్నారని, దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. విద్య శాఖ మీ దగ్గరే ఉంది ఎందుకు ఫీజు బకాయిలు Pending fee విడుదల చేయలేకపోతున్నారని సీఎంను వారు ప్రశ్నించారు. మీరు అధికారంలోకి రావడానికి మేము ఎంతో కష్టపడ్డము.. అధికారంలోకి వచ్చాక విద్య శాఖను గాలికి వదిలారని ఫైర్ అయ్యారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి CM Revanth విద్యాశాఖ పై దృష్టి పెట్టాలని (AISF) విద్యార్థి సంఘం నేతలు మాట్లాడారు.

Advertisement

Next Story

Most Viewed