రాష్ట్రంలో ఘోర రైలు ప్రమాదం.. రైలు ఢీకొని తండ్రి, ఇద్దరు కుమార్తెలు మృతి

by Gantepaka Srikanth |   ( Updated:2024-08-11 12:23:53.0  )
రాష్ట్రంలో ఘోర రైలు ప్రమాదం.. రైలు ఢీకొని తండ్రి, ఇద్దరు కుమార్తెలు మృతి
X

దిశ, మేడ్చల్ టౌన్: మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌడవెల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఆదివారం గౌడవెల్లి రైల్వే స్టేషన్‌లో తండ్రి, ఇద్దరు కూతుళ్లు రైలు ఢీకొని అక్కడికక్కడే మృతిచెందారు. మృతులు మేడ్చల్ పట్టణంలోని రాఘవేంద్ర నగర్ కాలనీకి చెందిన కృష్ణగా పోలీసులు గుర్తించారు. కృష్ణ గౌడవెల్లి రైల్వే స్టేషన్‌లో రైల్వే ట్రాక్ మెన్‌గా పనిచేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఆదివారం సెలవుదినం కావడంతో తన ఇద్దరు కూతుర్లను తీసుకొని పనికి వచ్చాడు. కృష్ణ పనిచేస్తుండగా తన కూతుళ్లు రైల్వే పట్టాలపై ఆడుకుంటున్నారు. ఇదే సమయంలో రైలు వేగంగా దూసుకొచ్చింది. ఇద్దరు కూతుళ్లను కాపాడబోయి ముగ్గురు రైలుకింద పడిపోయారు. మృతి చెందిన కూతుర్ల పేరు వర్షిత, వరిణిగా స్థానికులు చెప్తున్నారు.




Advertisement

Next Story

Most Viewed