Nagarjuna Sagar: నాగార్జున సాగర్ సుంకిశాల వద్ద ఘోర ప్రమాదం.. కుప్పకూలిన రిటెయినింగ్ వాల్

by Ramesh Goud |
Nagarjuna Sagar: నాగార్జున సాగర్ సుంకిశాల వద్ద ఘోర ప్రమాదం.. కుప్పకూలిన రిటెయినింగ్ వాల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: నాగార్జున సాగర్ వద్ద నిర్మిస్తున్న సుంకిశాల పంప్ హౌజ్ భారీ ప్రమాదం జరిగింది. సొరంగంలోని నీరు రాకుండా నిర్మించిన రిటెయినింగ్ వాల్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం సంభవించలేదని తెలిసింది. హైదరాబాద్ తాగునీటి అవసరాలు తీర్చడం కోసం నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజీ నుంచి కృష్ణజలాలను తరలించేందుకు నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం సమీపంలో సుంకిశాల పంప్ హౌజ్ నిర్మాణం చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో సొరంగంలోకి సాగర్ జలాలు రాకుండా రక్షణ కోసం రిటెయినింగ్ వాల్ నిర్మించారు.

ఇటీవల నాగార్జున సాగర్ కు భారీ వరద వచ్చి చేరడంతో రక్షణ గోడ ఒత్తిడికి గురై ఒక్కసారిగా కుప్పకూలింది. దీనికి సంబందించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పంప్ హౌజ్ నిర్మాణంలో షిఫ్ట్ కు వందమందికి పైగా మూడు షిఫ్ట్ లలో కార్మికులు పని చేస్తుంటారు. ఘటన జరిగిన సమయంలో కూలీలు షిఫ్ట్ మారడానికి వెళ్లడంతో ఘోర ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదం జరిగి దాదాపు వారం దాటినా అధికారులు బయటకి వెల్లడించకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. ఈ విషయం పట్ల అధికారులపై తీవ్ర విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. నిర్మాణ సంస్థ అవగాహాన లోపం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని పలు ఆరోపణలు వస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed