రైతుబంధు ఇచ్చేదెప్పుడు? మృగశిర కార్తె అయిపాయే.. నాట్లు మొదలయే!

by Anjali |   ( Updated:2024-06-09 05:33:12.0  )
రైతుబంధు ఇచ్చేదెప్పుడు? మృగశిర కార్తె అయిపాయే.. నాట్లు మొదలయే!
X

దిశ, వెబ్‌డెస్క్: రైతుబంధు ఇచ్చేదెప్పుడని కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతులు మండిపడుతున్నారు. ఎకరానికి రూ. 5,000 చొప్పున ఇచ్చే రైతుబంధు కాదు.. ఎకరానికి రూ. 7500 రైతు భరోసా ఇస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. కానీ ఇప్పటికి రైతుబంధు లేదు.. రైతు భరోసా లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మృగశిర కార్తె అయిపోయి.. నాట్లు మొదలై, దుక్కులు దున్నుతుంటే పెట్టుబడి సాయం కోసం ప్రతి సంవత్సరం జూన్ నెలలో ఇచ్చే రైతుబంధు గురించి ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ లేదు కార్యాచరణ లేదని తమ గోడు వెల్లగక్కుతున్నారు. గత ప్రభుత్వం సమయానికి రైతు బంధు అకౌంట్లలో వేసేదని, పెట్టుబడి కోసం అప్పులు తెచ్చుకోవాల్సి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2022 డిసెంబరు 28న పదో విడత రైతుబంధు పెట్టుబడి సాయం రైతుల ఖాతాల్లోకి పంపిణీ ప్రారంభమైన విషయం తెలిసిందే. పదో విడత కింద రూ. 7,676.61 కోట్లు విడుదల చేయగా, అర్హులైన 70.54 లక్షల మంది రైతలు ఖాతాల్లో రైతు బంధు నిధులు జమయ్యాయి. 2023 జూన్ 26న పదకొండో విడత రైతుబంధు పెట్టుబడి సాయం రైతుల ఖాతాల్లోకి పంపిణీ ప్రారంభమైంది.

Advertisement

Next Story