పురుగుల మందు డబ్బాలతో రోడ్డెక్కిన రైతులు (వీడియో)

by Sathputhe Rajesh |   ( Updated:2023-05-05 07:26:24.0  )
పురుగుల మందు డబ్బాలతో రోడ్డెక్కిన రైతులు (వీడియో)
X

దిశ, నల్లగొండ : నల్లగొండ జిల్లాలోని కనగల్ మండలంలోని ఎస్.లింగోటం వద్ద హాలియా రహదారిపై ముళ్ల కంచె వేసి పురుగుల మందు డబ్బాలతో తడిసిన ధాన్యం రాసులతో ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం కొనుగోలు ప్రారంభించింది అని చెప్పడం వరకే ఉంది అని కొనుగోలు మాత్రం జరగడం లేదని సర్కారు తీరుపై మండిపడ్డారు. ఐకేపీ సెంటర్లలో ధాన్యం పోసి నెల రోజులు దగ్గర పడుతున్న కొనుగోలు చేయటం లేదన్నారు. ఇక తమకు ఆత్మహత్యే శరణ్యం అని వాపోయారు. ఇక నైనా ప్రభుత్వం, అధికారులు స్పందించి ధాన్యం కొనుగోలు చేయాలని వేడుకున్నారు. రైతుల ఆందోళనతో నల్లగొండ హాలియా రహదారి వెంట కిలోమీటర్ల పొడవునా ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రైతులకు నచ్చ చెప్పే ప్రయత్నం కొనసాగుతుంది. అయితే ఇంత జరుగుతున్న రైతులతో మాట్లాడేందుకు అధికారులు రాకపోవడం గమనార్హం.



Advertisement

Next Story