- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
చేతులు దులుపుకుంటున్న సర్కార్.. కు.ని వైఫల్యానికి బాధ్యులెవరు..?
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ బాధ్యతారాహిత్యమో? డాక్టర్ల నిర్లక్ష్యమో గాని నాలుగు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. చిన్న చిన్న పిల్లలు తల్లుల ఆలనా పాలనకు దూరమయ్యారు. పది కాలాల పాటు సంతోషంగా జీవించాల్సిన కుటుంబాలు చిన్నాభిన్నం అయ్యాయి. ఇబ్రహీంపట్నం ఘటనకు బాధ్యులెవరనేది ప్రశ్నార్థకంగా మారింది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లలో ఇన్‌ఫెక్షన్లు సోకడంతోనే మహిళలు చనిపోయినట్లు ప్రాథమికంగా తెలుస్తున్నా, ఎంక్వైరీ కొనసాగుతున్నదంటూ ప్రభుత్వం దాటవేస్తున్నది. మార్గదర్శకాల ప్రకారమే ఆపరేషన్లు జరిగాయంటూ చేతులు దులుపుకుంటున్నది. బాధిత కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఇద్దరు డాక్టర్లను సస్పెండ్ చేస్తూ, లైసెన్స్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నది. కానీ ఘటనకు గల కారణాలను ఇప్పటివరకూ ప్రభుత్వం గాని, వైద్యశాఖ గాని గుర్తించలేదు. కు.ని అపరేషన్లు చేయించుకున్నవారిలో ఇన్‌ఫెక్షన్ల బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతుండటంతో డాక్టర్లు ఆ క్యాంపులో సర్జరీలు చేసుకున్న బాధితులందరి రక్త నమూనాలు మరోసారి తీసుకొని వివిధ రకాల పరీక్షలు చేస్తున్నారు. ఇన్‌ఫెక్షన్లకు గురైనోళ్లందరికీ నిమ్స్, అపోలో ఆస్పత్రుల్లోని స్పెషల్వార్డులో ట్రీట్మెంట్ ఇస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇక ఈ ఘటనను మానవ హక్కుల కమిషన్సుమోటోగా స్వీకరించింది. అక్టోబరు 10 వరకు పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని రంగారెడ్డి కలెక్టర్‌కు నోటీసులిచ్చింది.
ఏం జరిగింది?.. ఏం చేస్తున్నారు?
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో ఈ నెల 25న డాక్టర్లు 34 మందికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించారు. ఇందులో ఇప్పటి వరకు 13 మంది ఇన్‌ఫెక్షన్ల బారిన పడగా నలుగురు చనిపోయారు. ఈ నలుగురిలో గ్యాస్ట్రో సమస్యలు ఉన్నట్టు డాక్టర్లు చెబుతున్నారు. కాగా ఘటనపై డీహెచ్ నేతృత్వంలోని కమిటీ అధ్యయనం చేస్తున్నది. మహిళలు డిశ్చార్జ్ తర్వాత ఎలాంటి ఆహారం తీసుకున్నారు? ఏ మందులు వాడారు? పాడైన ఆహారం ఏమైనా తీసుకున్నారా? రక్తహీనత, బీపీ, షుగర్ల పరిస్థితి ఎలా ఉన్నది? రక్తస్రావం జరిగిందా? సర్జరీ చేసే క్రమంలో రక్తనాళాలు డ్యామేజ్ జరిగాయా? వంటి వాటిపై స్టడీ చేస్తు్న్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేరిన క్రమంలో అక్కడి డాక్టర్లు ఇచ్చిన ట్రీట్మెంట్, మెడికేషన్లను కూడా పరిశీలిస్తున్నారు.
మొక్కుబడిగా సాయం
ఇబ్రహీంపట్నం ఘటనలో డాక్టర్ల నిర్లక్ష్యం ప్రస్పూటంగా కనిపిస్తున్నది. ఆ నలుగురు ఒకే విధమైన లక్షణాలు కలిగి ఇన్‌ఫెక్షన్ల బారిన పడి మరణించారు. సర్జరీలు చేసే సమయంలో పరికరాలు క్లీన్‌గా మెయింటెన్చేయకపోవడంతోనే ఇన్‌ఫెక్షన్లు సోకి ఉండొచ్చనే అనుమానాన్ని నిమ్స్ డాక్టర్లు వ్యక్తం చేశారు. ఇక ఈ ఘటనలోని బాధితులకు కేవలం రూ. 5 లక్షల నష్టపరిహారం ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకున్నది. ఎక్కువ మొత్తంలో పరిహారం ఇవ్వాల్సిన ప్రభుత్వం సైలెంట్‌గా ఉన్నది. ప్రతిపక్ష పార్టీలు పెద్దఎత్తున నిరసనలు చేపడుతున్నాయి. కాంగ్రెస్‌పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో కోఠి ఆరోగ్యశాఖ కార్యాలయాన్ని ముట్టడించేందుకు పలువురు కార్యకర్తలు ప్రయత్నించారు.