తొమ్మిదేళ్లుగా సీఎం KCR కలవడం లేదు: అమరవీరుల కుటుంబ సభ్యుల ఆందోళన

by Satheesh |   ( Updated:2023-05-26 13:31:39.0  )
తొమ్మిదేళ్లుగా సీఎం KCR కలవడం లేదు: అమరవీరుల కుటుంబ సభ్యుల ఆందోళన
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం అమరుల త్యాగాలను గుర్తించడం లేదని.. అమరవీరుల కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్క్ ముందు తెలంగాణ అమరవీరుల కుటుంబ సభ్యుల ఆందోళన చేపట్టారు. అనంతరం అమరవీరుల స్థూపానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న స్మృతి వనంలో అమర వీరులను విస్మరించారని మండిపడ్డారు. 12 వందల మంది అమరుల చరిత్రను, వారి ఫోటోలను స్మృతి వనంలో పెట్టాలని డిమాండ్ చేశారు.

అలాగే స్మృతి వనాన్ని అమరుల కుటుంబ సభ్యులతో ప్రారంభించాలని డిమాండ్ చేశారు. గత తొమ్మిదేళ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను తాము కలవడానికి ప్రగతి భవన్ వెళ్తున్న గేట్ లోపలికి కూడా వెళ్ళనీయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అమరుల కుటుంబాల కోసం తెచ్చిన జీవో 80ను రద్దు చేయడం వల్ల పెన్షన్ కూడా అందడం లేదని వాపోయారు. వెంటనే జీవో 80 ను పునరుద్ధరించి.. జూన్ 2న స్మృతి వనం ప్రారంభానికి అమరవీరుల కుటుంబాలను ఆహ్వానించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story